For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై..తుది జట్లు ఇవే..

RR vs CSK: గౌహతిలోని బర్సపారా స్టేడియం వేదికగా చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నైలోని సొంత మైదానమైన చెపాక్ స్టేడియం వేదికగా బెంగళూరుతో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. మరోవైపు ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటములను ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ కూ కూడా ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనదే. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని రాజస్థాన్ జట్టు పట్టుదలతో ఉంది.

ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మొత్తం 29 మ్యాచ్‌లు జరగగా, చెన్నై 16 మ్యాచ్‌లలో, రాజస్థాన్ 13 మ్యాచ్‌లలో గెలిచింది. ఈ పిచ్ కాస్త పొడిగా ఉంటుంది. నాణ్యమైన స్పిన్ బౌలర్లపై బ్యాటింగ్ జట్టుకు మిడిల్ ఓవర్లు కీలకం కానున్నాయి. ఈ స్టేడియంలో 200 పరుగులు సాధ్యం కాకపోవచ్చని షేన్ వాట్సన్ పేర్కొన్నారు.

RR vs CSK Chennai Wins Toss and Opts to Bowl Final Playing XI Announced

తుది జట్లు ఇవే..
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రానా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), జామీ ఓవర్టన్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరానా , ఖలీల్ అహ్మద్

Story first published: Sunday, March 30, 2025, 19:22 [IST]
Other articles published on Mar 30, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+