న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: స్టోక్స్‌ సూపర్‌ క్యాచ్ (వీడియో)

IPL 2019 : Ben Stokes Takes A Stunning Catch To Dismiss Kedar Jadhav || Oneindia Telugu
RR vs CSK: Ben Stokes Takes super Flying Catch To Dismiss Kedar Jadhav

టీ20 క్రికెట్ వచ్చినప్పటి నుండి ఆటగాళ్లు అందరూ అద్భుతాలు చేస్తున్నారు. ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఐపీఎల్ సిజన్ -12లో బ్యాట్స్‌మన్‌ బంతిని స్టాండ్స్ లోకి పంపి అభిమానులను అలరిస్తుంటే.. ఫీల్డర్లు అద్భుత క్యాచ్‌లు పట్టి ఔరా అనిపిస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ ఓ అద్బుత క్యాచ్‌ను పట్టాడు.

ఆదిలోనే 3 కీలక వికెట్లు:

ఆదిలోనే 3 కీలక వికెట్లు:

గురువారం రాత్రి జైపూర్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్‌ కళ్లుచెదిరే క్యాచ్ పట్టారు. మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై.. ఆదిలోనే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఈ సమయంలో 6వ ఓవర్ ను రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ వేస్తున్నాడు.

సూపర్‌ మ్యాన్‌లా:

ఆర్చర్‌ వేసిన 6వ ఓవర్ 5వ బంతిని జాదవ్‌ పుల్‌ చేయాలని ప్రయత్నించాడు. కవర్ పాయింట్ మీదుగా దూసుకెళుతున్న బంతిని బెన్‌ స్టోక్స్‌ సూపర్‌ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి బంతిని పట్టేశాడు. దీంతో రాజస్థాన్ జట్టులో సంబరాలు మొదలవ్వగా.. జాదవ్‌ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్స్ పెడుతూ.. స్టోక్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఈ సూపర్ క్యాచ్‌ను మీరూ చూడండి.

క్యాచ్ పట్టినా ఫలితం లేదు:

క్యాచ్ పట్టినా ఫలితం లేదు:

24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది చెన్నై. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. రాయుడుతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ జోడి ఆచితూచి ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధ సెంచరీలు చేశారు. అర్ధ సెంచరీ అనంతరం రాయుడు అవుట్ అయినా.. ధోనీ చెన్నై జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. ఇక చివరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం కాగా.. శాంట్నర్ చివరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు. దీంతో బెన్‌ స్టోక్స్‌ సూపర్‌ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టినా ఫలితం లేకపోయింది.

Story first published: Friday, April 12, 2019, 14:26 [IST]
Other articles published on Apr 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X