పాపం చేతన్ సకారియా...కరోనాతో తండ్రి మృతి.. జనవరిలో తమ్ముడు..

IPL 2021 : కరోనాతో Chetan Sakariya Father మృతి.. జనవరిలో తమ్ముడు ఆత్మహత్య... || Oneindia Telugu

న్యూఢిల్లీ: తన అరంగేట్ర ఐపీఎల్ సీజన్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చి అందరి దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా వైరస్ బారిన పడిన అతని తండ్రి కంజి భాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రెండు రోజుల క్రితమే ఐపీఎల్ సంపాదనతో తన తండ్రికి మెరుగైన చికిత్స అందిస్తున్నానని, ఐపీఎల్ 2021 సీజన్ తన జీవితాన్ని మార్చిందని చేతన్ సకారియా తెలిపిన విషయం తెలిసిందే. ఇంతలోనే అతని తండ్రి మృతి చెందారన్న వార్త క్రికెట్ అభిమానులకు విషాదాన్ని మిగిల్చింది.

జనవరిలో తమ్ముడు..

జనవరిలో తమ్ముడు..

ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడటంతో ఇంటికి చేరిన సకారియా తన తండ్రి ని బతికించుకోవడానికి చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. గుజరాత్‌కు చెందిన సకారియా తండ్రి కొన్నేళ్లుగా డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారు. టెంపో నడిపి ఇద్దరు కొడుకలను చదివించారు. అయితే ఈ ఏడాది జనవరిలో సకారియా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషాదం నుంచి కుటుంబం కోలుకోకముందే కరోనా అతని తండ్రిని బలి తీసుకుంది. కఠిన బయోబబుల్ కారణంగా సకారియా తన తమ్ముడి కడ చూపుకు కూడా నోచుకోలేదు. ఆ సమయంలో అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉండగా కుటుంబ సభ్యులు తమ్ముడి వార్తను తెలియకుండా దాచారు.

రూ. కోటి 20 లక్షలు..

రూ. కోటి 20 లక్షలు..

ఐపీఎల్ 2021 సీజన్ కోసం జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ చేతన్ సకారియాను రూ. కోటి 20 లక్షలకు కొనుగోలు చేసింది. దాంతో అతను ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. పేద కుటుంబం నుంచి ఓ స్టార్ ప్లేయర్ ఎదిగిన అతని ప్రయాణం ప్రతీ ఒక్కరికి స్పూర్తిదాయకం. ఇక అతనిపై ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నిలబెట్టుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడిన చేతన్ సకారియా.. ఏడు వికెట్లు తీశాడు. రెండు సార్లు మూడేసి వికెట్లు పడగొట్టాడు. పంజాబ్‌తో జరిగిన అరంగేట్ర మ్యాచ్‌లోనే (3/31) కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, జై రిచర్డ్‌సన్‌లను పెవిలియన్ చేర్చాడు. ఆ మ్యాచ్‌లో నికోలస్ పూరన్‌ను సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు.ఇది ఈ సీజన్‌కే హైలైట్‌గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్స్ సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీల వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్ ఆడే సకారియా.. టీ20 క్రికెట్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు తీశాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముఖంలో చిరునవ్వే ఉండే సకారియాకు మంచి భవిష్యత్తు ఉందని కామెంటేర్లు తరుచూ కొనియాడేవారు.

ఐపీఎల్ జరగకుంటే..

ఐపీఎల్ జరగకుంటే..

రెండు రోజుల క్రితమే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఐపీఎల్‌ సంపాదనతో కరోనా బారిన పడిన తండ్రికి మెరుగైన చికిత్స అందిస్తున్నానని తెలిపాడు. 'చాలా మంది ఐపీఎల్‌ను ఆపేయాలని డిమాండ్ చేశారు. వారందరికి నేనొక్కటే చెప్పాలనుకుంటున్నా. నా కుటుంబంలో డబ్బులు సంపాదించేది నేనొక్కడినే. నా సంపాదనకు ఏకైక మార్గం ఐపీఎల్. ఈ లీగ్ నుంచి సంపాదించిన డబ్బుతోనే నేను నా తండ్రికి మెరుగైన చికిత్స అందిస్తున్నాను. నెలరోజుల పాటు ఈ టోర్నీ గనుక జరగకపోయుంటే నా పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. నా తండ్రి తన జీవితం మొత్తం టెంపో డ్రైవర్‌గా పనిచేశాడు. కాబట్టి నా జీవితమే ఐపీఎల్. అదే నా రాతను మార్చేది'అని సకారియా భావోద్వేగానికి గురయ్యాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, May 9, 2021, 13:51 [IST]
Other articles published on May 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X