కెప్టెన్ ఒకలా.. కోచ్ మరోలా! రాజస్థాన్ రాయల్స్‌లో అంతర్గత విభేదాలు?
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో తీవ్ర చర్చ నడుస్తోంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది. ఈ సీజన్లో అసలు తమ జట్టు ప్లేఆఫ్స్ చేరుతుందని ఎవరూ ఊహించలేదని.. అసలు తాము ఇక్కడివరకు రావడమే ఎక్కువ అన్నట్లుగా రియాన్ పరాగ్ మాట్లాడాడు. అయితే కెప్టెన్ చేసిన ఈ కామెంట్స్‌ను రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర పూర్తిగా ఖండించాడు. తాము ప్లేఆఫ్స్ ఆశలతోనే బరిలోకి దిగామని చెబుతూ రియాన్ పరాగ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం ఎన్నో ఎత్తుపల్లాల మధ్య సాగింది. లీగ్ దశ చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై గెలిచి నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్ చేరిన రాజస్థాన్.. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. కానీ శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్-2లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. జట్టులో ఎక్కువ మంది యువకులు, అనుభవం లేని ప్లేయర్లు ఉన్నందున తాము టాప్-4 లోకి వస్తామని అనుకోలేదన్న రియాన్ పరాగ్ కామెంట్లపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సంగక్కరను ప్రశ్నించగా.. ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

జట్టు సెలెక్షన్, ఫ్రాంచైజీ గురించి సంగక్కర మాట్లాడుతూ, "మేము కేవలం మ్యాచ్‌లు గెలిపించే ఆటగాళ్లను, వెంటనే బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నవారిని మాత్రమే జట్టులోకి తీసుకున్నాం. టైటిల్ గెలవాలనే మైండ్‌సెట్‌తోనే ప్రతి ఒక్కరినీ కొనుగోలు చేశాం. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ వయసు రీత్యా అనుభవం లేకపోయినా, అతను మా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడేందుకు పూర్తి అర్హుడు అని నమ్మి తీసుకున్నాం. జట్టులో కొంత ఇన్‌ఎక్స్‌పీరియన్స్ ఉన్న మాట వాస్తవమే కావచ్చు, కానీ వారంతా ఇక్కడికి వచ్చింది కేవలం గెలవడానికే" అని సంగక్కర స్పష్టం చేశాడు.
ఫ్రాంచైజీ గత కొన్ని ఏళ్లుగా కేవలం ఆటగాళ్ల అభివృద్ధి అనే కోణం నుంచి ఆలోచించడం మానేసిందని సంగక్కర వివరించాడు. గత రెండు వేలాలల్లో పర్స్ మనీని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయామని అంగీకరించినప్పటికీ.. గెలుపు కోసమే వ్యూహాలు రచించామని చెప్పాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ కామెంట్లతో విభేదించినప్పటికీ.. పూర్తి స్థాయి కెప్టెన్‌గా రియాన్ పరాగ్ చేసిన మొదటి సీజన్ అద్భుతంగా ఉందని కోచ్ కొనియాడాడు. మైదానంలో రియాన్ పరాగ్ తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయని, ఈ సీజన్ నుంచి అతను మరిన్ని విషయాలు నేర్చుకుని భవిష్యత్తులో మరింత మెరుగైన కెప్టెన్‌గా ఎదుగుతాడని సంగక్కర ఆశాభావం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications