
సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2o22లో మంచి ప్రదర్శన కనబరిచింది. టోర్నమెంట్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో 7వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ ఆ జట్టు ప్రదర్శన మాత్రం సీజన్లో ఆద్యంతం ఆకట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయర్లైన జోస్ బట్లర్ ఆరెంజ్ క్యాప్ కలిగి ఉండగా.. యుజ్వేంద్ర చాహల్ పర్పుల్ క్యాప్ కలిగి ఉన్నాడు. ఐపీఎల్ 15వ ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ తన ప్రస్థానాన్ని రన్నరప్‌గా ముగించిన తర్వాత ఆర్ఆర్ క్రికెట్ డైరెక్టర్ కుమార సంగక్కర ఆ జట్టు ప్రదర్శన గురించి, వచ్చే 2023 సీజన్లో జట్టు ఎదుగుదల గురించి మాట్లాడాడు.
తదుపరి సీజన్‌కు ముందు జట్టు కోసం అవసరమైన లోటుపాట్లను సరిచేసుకోవడాన్ని ప్రస్తావించాడు. ఇక ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్, అశ్విన్‌లు వచ్చే సీజన్లో మరింత ప్రభావవంతంగా బరిలోకి దిగుతారని పేర్కొన్నాడు.ఇక సంగక్కర రియాన్ పరాగ్ గురించి మాట్లాడుతూ.. పరాగ్‌కు బ్యాటింగ్ చేయడంలో మంచి సామర్థ్యం ఉంది. మేము అతని బ్యాటింగ్ ఆర్డర్ మార్చుతాం. స్పిన్‌తో పాటు పేస్‌కు తగ్గట్లు తన ఆటతీరును మార్చుకోగల రియాన్ పరాగ్‌ను కేవలం డెత్‌ఓవర్లలో హిట్టర్‌గా కాకుండా మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా అతన్ని తీర్చిదిద్దాలని ఎదురుచూస్తున్నాను' అని సంగక్కర వర్చువల్ పోస్ట్ మ్యాచ్‌లో పేర్కొన్నాడు.
ఇకపోతే అశ్విన్ బ్యాటింగ్, బౌలింగ్ సామర్థ్యాలను సూచిస్తూ.. అశ్విన్ జట్టు కోసం చాలా చేశాడు. అయితే బౌలింగ్లో ఇంకాస్త మెరుగుపడాల్సిన అవసరముంది. దాని గురించి మేము ఆలోచిస్తున్నాం. అతన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకోవడానికి ప్రణాళికలు రచిస్తామన్నాడు. అశ్విన్ ఐపీఎల్ 2022లో రాయల్స్‌కు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఉపయుక్తమయ్యాడు. అతను 12 ఇన్నింగ్స్‌లలో 27.29సగటుతో 141.48 స్ట్రైక్ రేట్‌తో 191పరుగులు చేశాడు.
మంచి ఎకానమీ 7.51రేటుతో 12వికెట్లు తీశాడు. ఇకపోతే 2008తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ఫైనల్స్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో సీఎస్కేను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకున్న రాజస్థాన్ రాయల్స.. ఈసారి గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా మిగిలిపోయింది.