RR vs CSK: డుప్లెసిస్ చెలరేగినా.. ధోనీ హ్యాట్రిక్ సిక్సర్లు బాదినా.. రాజస్థాన్‌దే విజయం!!

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో రాజస్తాన్ రాయల్స్ బోణీ చేసింది. సమిష్టి ప్రదర్శనతో పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్‌పై సూపర్ విక్టరీ నమోదు చేసింది. సంజూ శాంసన్ (74; 32 బంతుల్లో 1x4, 9x6) మెరుపులు, స్టీవ్ స్మిత్ (69; 47 బంతుల్లో 4x4, 4x6) మాస్టర్ స్ట్రోక్.. జోఫ్రా ఆర్చర్ (27; 8 బంతుల్లో 4x6) సంచలన ఇన్నింగ్స్.. రాహుల్ తేవాటియా (3/37) సూపర్ బౌలింగ్‌తో 16 పరుగుల తేడాతో చెన్నైపై రాజస్థాన్ విజయ ఢంకా మోగించింది. లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఫాఫ్ డూప్లెసిన్ (72; 36 బంతుల్లో 1x4, 7x6) ఒంటరి పోరాటం చేసినా.. ఎంఎస్ ధోనీ హ్యాట్రిక్ సిక్సర్లు బాదినా.. రాజస్థాన్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు.

వాట్సన్ చెలరేగినా:
రాజస్తాన్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. మురళీ విజయ్-షేన్ వాట్సన్‌లు దూకుడుగా ఆడారు. వాట్సన్ నాలుగు సిక్స్‌లు బాదాడు. మరోవైపు విజయ్ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. అయితే స్పిన్నర్ గోపాల్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి వాట్సన్ బోల్ట్ అయ్యాడు. దీంతో 56 పరుగుల భాగస్వామ్యంకు తెరపడింది. కాసేపటికి విజయ్ కూడా ఔటయ్యాడు. షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు.

డూప్లెసిన్ ఒంటరి పోరాటం:
ఆపై సామ్ కరన్ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మంచి ఊపుమీద కనిపించినా.. ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేదు. రుతురాజ్ గైక్వాడ్ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో చెన్నై కష్టాల్లో పడింది. తొమ్మిదో ఓవర్ ఐదో బంతికి సామ్ కరన్ స్టంపౌట్ అవ్వగా.. ఆ తర్వాత బంతికే రుతురాజ్ అదే తరహాలో నిష్క్రమించాడు. దాంతో సీఎస్‌కే 77 పరుగులకే కీలక నాలుగు వికెట్లు కోల్పోయింది. కేదార్ జాధవ్ (22) ధాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. అయితే డూప్లెసిన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఇక చివరి ఓవర్‌లో కెప్టెన్ ధోనీ (28; 16 బంతుల్లో 3x6) హ్యాట్రిక్ సిక్సులు బాదడంతో చెన్నై స్కోర్ 200కి చేరింది. రాజస్తాన్ బౌలర్లలో తెవాటియా మూడు వికెట్లు పడగొట్టాడు.

సిక్సర్ల మోత మోగించిన శాంసన్:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6) త్వరగానే పెవిలియన్ చేరాడు. మూడో ఓవర్‌లోనే దీపక్ చాహర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్ ఆదినుంచి రెచ్చిపోయి ఆడాడు. చెన్నై బౌలర్లపై ఆకలిగొన్న పులిలా విరుచుకుపడ్డాడు. ఏ మాత్రం కనికరం లేకుండా సిక్సుల వర్షం కురిపించాడు. కొడితే బంతి బౌండరీ దాటాల్సిందే అన్నంతలా చెలరేగిపోయాడు. సిక్సర్ల మోత మోగించి 19 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ బాదాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి అతడు రెండో వికెట్‌కు 122 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే సెంచరీ వైపు వెళ్తున్న సంజూని లుంగీ ఎంగిడి ఔట్ చేశాడు. భారీ సిక్సర్ కొట్టబోయి చహర్ చేతికి చిక్కాడు.

ఆర్చర్ మెరుపులు:
సంజూ పెవిలియన్ చేరిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. పుంజుకున్న చెన్నై బౌలర్లు మిడిలార్డర్‌ను కుప్పకూల్చారు. దీంతో స్మిత్‌కు సహకరించే బ్యాట్స్‌మన్ కరవయ్యారు. అయితే స్మిత్ (69; 47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మాత్రం తనదైన శైలిలో రెచ్చిపోయి అర్ధ శతకం చేశాడు. చివరికి 69 పరుగుల చేశాక.. సామ్ కరన్ బౌలింగ్‌లో కేదార్ జాధవ్‌కు చిక్కాడు. ఇక్కడే రాజస్థాన్ బ్యాటింగ్ ఊపందుకుంది. చివరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్ (27; 8 బంతుల్లో 4x6) ఎంగిడీకి పీడకల మిగిల్చాడు. వరుసగా నాలుగు భారీ సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్‌లో మొత్తం 30 పరుగులు రావడంతో.. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది. చెన్నై బౌలర్లలో శామ్ కరన్ మూడు వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications