వారి వల్లే ఓడిపోయాం: రియాన్ పరాగ్
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలైన అనంతరం ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ప్రజెంటేషన్‌లో రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఓటమి గల కారణాలను వివరించాడు. తమ జట్టు చేసిన స్కోరు విజయానికి సరిపోతుందనే భావించానని పేర్కొన్నాడు. ఈ పిచ్‌పై 200 పరుగులు 'పార్ స్కోరు' అని, ఇన్నింగ్స్ గడిచేకొద్దీ పిచ్ నెమ్మదిస్తుందని అంచనా వేసినట్లు వెల్లడించాడు. అయితే, మిడిల్ ఓవర్లలో తమ బౌలర్లు మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సి ఉందని.. ప్రత్యర్థి బ్యాటర్లు సులభంగా పరుగులు రాబట్టకుండా అడ్డుకోవడంలో విఫలమయ్యామని పరాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ముఖ్యంగా మ్యాచ్ గతిని మార్చిన ఓవర్ల గురించి ప్రస్తావిస్తూ.. ఒకే ఓవర్లో వరుసగా బౌండరీలు సమర్పించుకోవడం, ఆ తప్పు పదేపదే పునరావృతం కావడం తమ కొంపముంచిందని రియాన్ పరాగ్ పేర్కొన్నాడు. దీనివల్ల ఢిల్లీ బ్యాటర్లకు ఫామ్ దొరికిందని, ఆ విషయంలో తాము ప్లాన్ మార్చుకోవడంలో విఫలమయ్యామని అంగీకరించారు. అయితే మ్యాచ్ ఫలితం తేడాగా వచ్చినప్పటికీ.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంలో తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆయన సమర్థించుకున్నాడు.

ఇక విధ్వంసకర బ్యాటర్ డోనోవన్ ఫెరీరాను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపకపోవడంపై వస్తున్న విమర్శలకు రియాన్ పరాగ్ క్లారిటీ ఇచ్చాడు. ఆ సమయంలో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉండాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఇన్నింగ్స్ మరో 8-9 ఓవర్లు ఉన్నప్పుడు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఓవర్లకు 8 లేదా 9 పరుగులు తీసి, ఆ తర్వాత వచ్చే పేసర్లను ఫెరీరా వంటి పవర్ హిట్టర్లు నేరుగా ఎదుర్కోవాలనేది తమ వ్యూహమని వివరించాడు. పరిస్థితులకు అనుగుణంగానే ఆ నిర్ణయం తీసుకున్నామని, అందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏమీ లేదని స్పష్టం చేశాడు.
తన వ్యక్తిగత గాయం గురించి స్పందిస్తూ.. అది హ్యామ్‌స్ట్రింగ్ సమస్య అని, ప్రస్తుతానికి తీవ్రత తక్కువగానే ఉందని ఆశిస్తున్నట్లు రియాన్ పరాగ్ తెలిపాడు. అదృష్టవశాత్తూ తర్వాతి మ్యాచ్‌కు వారం రోజుల సమయం ఉండటంతో కోలుకోవడానికి అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తన బ్యాటింగ్ ఫామ్‌పై వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ.. విమర్శకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పాడు. జట్టుకు రెండు పాయింట్లు అందించడమే తన అసలు లక్ష్యమని.. జట్టు ఓడిపోయినప్పుడు తన వ్యక్తిగత స్కోరు లేదా ఇన్నింగ్స్ ఎన్ని పరుగులు ఉన్నా అది నిరర్థకమేనని పరాగ్ భావోద్వేగంగా సమాధానమిచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications