Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ఫైనల్: ఓటమికి కారణం చెప్పిన స్మిత్ (ఫోటోలు)

హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన ఐపీఎల్ పదో సీజన్ పైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

నిజానికి ఫైనల్ మ్యాచ్‌లో గెలుపు ముంగిట రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ తడబడిందనే చెప్పాలి. చివరి ఐదు ఓవర్లలో పూణె విజయానికి కావాల్సిన పరుగులు 47. చేతిలో ఎనిమిది వికెట్లు కూడా ఉన్నాయి. ఈ పరుగులు చేసినట్లైతే పూణెని తొలి ఐపీఎల్ టైటిల్ వరించేదే.

RPS vs MI IPL Final: Hard defeat to swallow, says Steve Smith

ఇలాంటి సమయంలో మ్యాచ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ పూణె విజయం ఖాయమని అనుకున్నారు. కానీ, చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పూణె ఒక పరుగు తేడాతో పరాజయం పాలైంది. చివరివరకు క్రీజులో ఉండి 51 పరుగులు చేసినా జట్టుకు విజయాన్నిందించలేకపోయానని కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మ్యాచ్‌ అనంతరం ఒకింత నిర్వేదంగా మాట్లాడాడు.

'ఈ ఓటమిని దిగమింగుకోవడం కష్టంగా ఉంది. అయితే, టోర్నమెంట్ మొత్తం తమ ఆటగాళ్లు చక్కని ఆటతీరు ప్రదర్శించడం గర్వంగా ఉంది. 129 పరుగులు భారీ లక్ష్యమేమీ కాదు, కానీ ఈ వికెట్‌ మీద పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. అందువల్లే గెలుపునకు దూరమయ్యాం' అని స్టీవ్ స్మిత్ చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో తమ ఓటమికి ముంబై బౌలర్లే ప్రధాన కారణమని స్మిత్‌ అంగీకరించాడు. పరుగులు చేయకుండా తమ బ్యాట్స్‌మెన్‌ను ముంబై బౌలర్లు నిలువరించారని, అదే మ్యాచ్‌ గతిని మార్చేసిందని చెప్పాడు.

'మా చేతిలో వికెట్లు ఉన్నాయి. ఒకటి, రెండు మంచి ఓవర్లు పడితే చాలు మ్యాచ్‌ మా చేతిలోకి వచ్చేది. కానీ, వాళ్లు (బౌలర్లు) అద్భుతంగా ఆడి.. మమ్మల్ని నిలువరించారు' అని స్టీవ్ స్మిత్ చెప్పాడు. ఐపీఎల్‌లో ఆడటం చాలా అద్భుతంగా ఉందని, గత రెండేళ్ల కాలంలో ఐపీఎల్‌లో ఆడటం ద్వారా ఎన్నో నేర్చుకున్నానని స్మిత్‌ చెప్పాడు.

'అద్భుతం. గత రెండేళ్ల కాలంలో ఐపీఎల్‌లో ఆడటం ద్వారా చాలా నేర్చుకున్నా. నా ప్రాంఛైజీకి ధన్వవాదాలు. ఎవరికి తెలుసు వచ్చే ఏడాది ఏ ప్రాంఛైజీ తరుపున ఆడతామో. ఓడిపోవడం నిరాశకు గురి చేసింది. గెలిస్తే సంతోషం మరోలా ఉండేది' అని స్మిత్ చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+