న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అవన్నీ వట్టి మాటలే.. ఆర్‌సీబీ పేరు మారలేదు.. కొత్త లోగో మాత్రం ఇదే!!

Royal Challengers Bangalore unveil their new logo, no name change ahead of IPL 2020

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ పేరు, లోగో మారబోతుందని గత 48 గంటలుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆర్సీబీకి సంబంధించి సోషల్ మీడియా అకౌంట్స్ ప్రొఫైల్ పిక్చర్స్ మాయమవడం, 'ఆర్సీబీ కొత్తశకం ఆరంభమవుతోంది.. ఈ వాలంటైన్స్ డే మీకు మరిచిపోలేని రోజు'అంటూ ఫ్రాంచైజీ అధికారికంగా ట్వీట్ చేయడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది.

అయితే ఆర్‌సీబీ అన్నట్లు ప్రేమికుల రోజున(ఫిబ్రవరి14) తమ అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌నే ఇచ్చింది. కాకపోతే పేరు మారుతుందనే వార్తలన్నీ గాలీ వార్తలనే తేలుస్తూ.. ఒక్క లోగోనే మార్చింది.

సింహాం రిటర్న్..

ఆర్సీబీ కొత్త లోగోలో.. తలపై కిరీటంతో ఉన్న సింహాం రాయల్ వంశానికి తిరుగొస్తున్నట్లు ఉంది. ఇక కొత్త లోగో తమ రాత మారుస్తుందని ఆర్‌సీబీ యాజమాన్యం భావిస్తోంది. ఒక్కసారి టైటిల్ కూడా నెగ్గని ఆర్సీబీ ఈ సారైనా ఆ కలను నేరవేరుస్తుందని అటు ఫ్రాంచైజీ, ఇటు అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ కొత్తలోగో‌ మీ అభిమాన జట్టుకు మధురానుభూతిని ఇస్తుందనుకుంటున్నాం. కొత్త శకం.. కొత్త ఆర్బీబీ.. ఇది మా సరికొత్త లోగో అని ఆర్‌సీబీ ట్వీట్ చేసింది.

అమ్మాయిల పిచ్చిలో చేసిన తప్పిదం నన్ను వెంటాడుతోంది : ఆండ్రూ రసెల్

కెప్టెన్‌కు ఎలాంటి సమాచారం లేదు:

ఈ లోగో మార్పు విషయంపై ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం తన ట్విట్టర్ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'పోస్ట్‌లు అదృశ్యమయ్యాయి. కెప్టెన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మీకు ఏమైనా సహాయం కావాలంటే నన్ను అడగండి' అని కోహ్లీ ట్వీట్ చేశాడు. దీనికి ఆర్‌సీబీ కూడా స్పందించింది. కెప్టెన్ అంతా బాగుంది. ప్రతీ అద్భుత ఇన్నింగ్స్ కూడా సున్నాతో ప్రారంభమవుతుందని బదులిచ్చింది. ఆర్‌సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా స్పందించాడు. 'మా సోషల్ మీడియా ఖాతాలకు ఏం జరిగింది?. ఇది కేవలం వ్యూహాత్మక విరామం అని ఆశిస్తున్నా' అని రాసుకొచ్చాడు.

పోస్ట్‌లు ఎక్కడికి వెళ్లాయి:

పోస్ట్‌లు ఎక్కడికి వెళ్లాయి:

ఆర్‌సీబీ మరో ఆటగాడు యుజ్వేంద్ర చాహల్‌ కూడా ఈ విషయాన్ని (ఆర్‌సీబీ పేరు మార్పు) ట్విటర్‌లో ప్రస్తావించాడు. ప్రొఫైల్‌ పిక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లు ఎక్కడికి వెళ్లాయి' అని సరదాగా ప్రశ్నించాడు. మరోవైపు ఆర్సీబీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ స్క్రీన్ షాట్‌ను షేర్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా 'అంతా ఓకేనా' అని పరామర్శించింది. కోహ్లీ ట్వీట్‌ చేసిన కొద్ది సేపటికే ఆర్‌సీబీ సోషల్‌ మీడియా అకౌంట్లలలో (ఫేస్‌బుక్‌​, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌) ప్రొఫైల్‌ పిక్‌ లోడ్‌ అవుతున్నట్టు ఉండేలా ఓ ఫొటోను పోస్ట్ చేసింది.

Story first published: Friday, February 14, 2020, 13:40 [IST]
Other articles published on Feb 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X