
ఎంఎస్ ధోనీ వర్సెస్ విరాట్ కోహ్లీ..
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ- ఇద్దరూ తమ తమ జట్లకు కేప్టెన్సీ వహిస్తోన్నారు. ఈ ఇద్దరు కేప్టెన్లుగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోయే చివరి మ్యాచ్ ఇదే కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్ తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకోబోతోన్నాడు. ఈ విషయాన్ని అతను ఇప్పటికే ప్రకటించాడు కూడా. రాయల్ ఛాలెంజర్స్ కేప్టెన్‌గా ఇదే తన చివరి ఐపీఎల్ అంటూ చెప్పాడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కీలకంగా మారింది.

కోహ్లీ టీమ్ గెలిచి తీరాల్సిందే
ఈ సాయంత్రం షార్జా స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్, సూపర్ కింగ్స్‌కు కీలకంగా మారింది. ప్రత్యేకించి- కోహ్లీసేనకు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. కాస్త బెటర్ పొజీషన్‌లో ఉంటుంది బెంగళూరు టీమ్. లేదంటే- తన స్థానాన్ని మరింత దిగజార్చుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయంది. 92 పరుగులకే కుప్పకూలిపోయింది. అటు బౌలింగ్ ఏమైనా రాణించిందా అంటే అదీ లేదు. ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి.. లక్ష్యాన్ని ఛేదించేశారు నైట్ రైడర్స్.

నైట్ రైడర్స్‌పై ఘోరంగా..
ఈ సాల కప్ నమ్దే అంటూ సీజన్‌ను ఘనంగా ఆరంభించినప్పటికీ- ఆ తరువాత చతికిలపడినట్టు కనిపిస్తోంది బెంగళూరు జట్టు. ఎనిమిది మ్యాచుల్లో మూడింట్లో ఓడింది. ఈ మూడో ఓటమి దారుణంగా మారింది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలం కావడం, కేప్టెన్‌గా తప్పుకొంటానంటూ విరాట్ కోహ్లీ ప్రకటించడం వంటి పరిణామాలతో కొంత గందరగోళంలో పడినట్టే. దీని నుంచి బయటపడాలంటే ఓ గెలుపు తక్షణ అవసరం. ఈ పరిస్థితుల్లో ధోనీ సేను ఢీ కొట్టి.. గెలుపు సాధిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్స్ ఇవీ..
కీలకంగా మారిన ఈ మ్యాచ్‌లో తుదిజట్టులో ఎవరు ఆడబోతోన్నారనేది ఆసక్తికరంగా మారింది. ఓవర్సీస్ ప్లేయర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, కైలె జెమిసన్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీలంక ఏస్ స్పిన్నర్ వనిందు హసరంగకు తుదిజట్టులో చోటు దక్కే అవకాశాలు లేకపోవచ్చు. కోల్‌కత నైట్ రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో వనిందు హసరంగ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. రెండు ఓవర్లలోనే 20 పరుగులు బాదారు నైట్ రైడర్స్. ఈ మ్యాచ్‌లో అతణ్ని పక్కక పెట్టడానికి అవకాశం ఉంది. హసరంగ స్థానంలో దుష్మంత్ చమీరా లేదా జార్జ్ గార్టన్‌ను తీసుకోవచ్చు.

సచిన్ బేబీ అవుట్?
మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సచిన్ బేబికి కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు దాదాపుగా లేకపోవచ్చు. కోల్‌కత నైట్ రైడర్స్‌పై అతను కూడా రాణించలేదు. ఏడు పరుగులే చేశాడతను. దీనికోసం ఏకంగా 17 బంతులు ఆడాడు. టీ20 ఫార్మట్‌లో కాస్త ఫామ్‌లో ఉన్న ఏ బ్యాట్స్‌మెన్ అయినా ఈ 17 బంతుల్లో ఏకంగా అర్ధసెంచరీనే బాదేస్తాడు. అలాంటిది ఏడు పరుగుల కోసం 17 బంతులను తీసుకున్న సచిన్ బేబీ డగౌట్‌కే పరిమితం కావచ్చు. అటు హసరంగ గానీ, ఇటు సచిన్ బేబి టాలెంట్‌ను గానీ తక్కువ చేసి చూడలేమనే అభిప్రాయాలు సైతం టీమ్ మేనేజ్‌మెంట్‌లో వ్యక్తమౌతున్నాయి.

జట్టు కూర్పు ఇలా ఉండొచ్చు..
ఈ సాయంత్రం చెన్నైను ఢీ కొట్టబోయే బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ (కేప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, వనిందు హసరంగ/దుష్మంత చమీర, సచిన్ బేబీ/మహ్మద్ అజరుద్దీన్, కైలె జెమిసన్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్ తుది జట్టులో చోటు దక్కించుకోవడానికి అవకాశం ఉన్నట్లు అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.


Click it and Unblock the Notifications
