Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs RR: టీమ్ ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్స్: కోహ్లీ సేన నుంచి ఆ ఇద్దరూ అవుట్?

Royal Challengers Bangalore Playing 11 vs RR: Kyle Jamieson In And Hasaranga Doubt For Match 43

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో కీలక మ్యాచ్‌ ఈ సాయంత్రం ఆరంభం కాబోతోంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కేఎల్ రాహుల్ కేప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ తలపడబోతోన్నాయి. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమౌతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదిక కానుంది.

కోహ్లీ టీమ్ మళ్లీ గాడిన

కోహ్లీ టీమ్ మళ్లీ గాడిన

ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకూ కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంటుంది. రెండో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది ఆర్సీబీ. కోల్‌కత నైట్ రైడర్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లల్లో ఓడిపోయినా.. మళ్లీ పుంజుకోగలిగింది. తన తరువాతి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను మట్టి కరిపించింది.

కోహ్లీకి ఘనంగా వీడ్కోలు చెప్పాలీ అంటే..

కోహ్లీకి ఘనంగా వీడ్కోలు చెప్పాలీ అంటే..

ఈ సీజన్ తరువాత విరాట్ కోహ్లీ కేప్టెన్సీ హోదా నుంచి తప్పుకోనున్నాడు. అందుకే- ఈ సారి కప్ కొట్టాలనే కసిలో ఉంది రాయల్ ఛాలెంజర్స్ టీమ్. టైటిల్ గెలిచి తమ కేప్టెన్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని ప్రయత్నిస్తోంది. తన కోరిక నెరవేరాలంటే- రాజస్థాన్ రాయల్స్‌ను కూడా చిత్తు చేయక తప్పదు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లే ఆఫ్ ఆశలు దాదాపుగా ఖాయం అవుతాయి. ఐపీఎల్ టోర్నమెంట్ ఎమిరేట్స్‌కు షిఫ్ట్ అయిన తరువాత తొలి రెండు మ్యాచుల్లో ఓడింది బెంగళూరు జట్టు. కీలకమైన మ్యాచ్‌లో తనకంటే బలమైన ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.

ఆత్మవిశ్వాసంతో బరిలో..

ఆత్మవిశ్వాసంతో బరిలో..

ముంబై ఇండియన్స్‌పై సాధించిన విజయం రాయల్ ఛాలెంజర్స్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మళ్లీ టైటిల్ రేసులో నిలబెట్టింది. 10 మ్యాచుల్లో ఆరింట్లో గెలిచింది. టాప్ 3 నుంచి కిందికి దిగజారలేదా టీమ్. మొత్తం 12 పాయింట్లతో అదే మూడో స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌పైనా గెలిస్తే..తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంటుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో తుదిజట్టు కూర్పు ఎలా ఉండొచ్చనేది ఆసక్తిగా మారింది.

కైలె జెమిసన్‌కు ఛాన్స్ ఉందా?

కైలె జెమిసన్‌కు ఛాన్స్ ఉందా?

ఓవర్సీస్ ప్లేయర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ చోటు ఖాయమూ. మ్యాక్సీ మొన్నటి మ్యాచ్‌ను గెలిపించాడు. కైలె జెమిసన్‌కు అవకాశం ఉండకపోవచ్చు. చివరి రెండు మ్యాచుల్లో అతను ఒక్క వికెట్‌ను కూడా పడగొట్టలేకపోయాడు. ముంబై ఇండియన్స్‌పై మ్యాచ్‌లో ధారాళంగా పరుగులను సమర్పించుకున్నాడు. రెండు ఓవర్లలో 22 పరుగులు ఇచ్చుకున్నాడు. అంతకుముందు మ్యాచ్‌లోనూ జెమిసన్ వికెట్లు తీసుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అతన్ని పక్కన పెట్టొచ్చు.

 హసరంగతోనూ నో యూజ్

హసరంగతోనూ నో యూజ్

శ్రీలంక ఏస్ స్పిన్నర్ వనిందు హసరంగ‌కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశాలు లేకపోవచ్చు. సెకెండ్ హాఫ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతను అంచనాలకు అందుకోవట్లేదు. హసరంగకు ఇదే తొలి ఐపీఎల్ కావడం వల్ల ఆ బెరుకు ఉన్నట్టుగా భావించారు. మ్యాచ్‌లు కొనసాగుతున్నా.. అతనిలో ఆ భయం అనేది పోలేదు. బౌలింగ్‌లో తడబడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అతణ్ని పక్కక పెట్టడానికి అవకాశం ఉంది. హసరంగను డగౌట్‌కు పరిమితం చేస్తే అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.

జట్టు కూర్పు ఇలా ఉండొచ్చు..

జట్టు కూర్పు ఇలా ఉండొచ్చు..

ఈ సాయంత్రం రాజస్థాన్ రాయల్స్‌తో ఢీ కొట్టబోయే బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ (కేప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, డేనియల్ క్రిస్టియన్, కైలె జెమిసన్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్‌ తుది జట్టులో చోటు దక్కించుకోవడానికి అవకాశం ఉన్నట్లు అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. జెమిసన్ స్థానంలో జార్జ్ గార్టన్ లేదా ఆకాష్ దీప్‌లను తీసుకోవచ్చు.

Story first published: Wednesday, September 29, 2021, 11:32 [IST]
Other articles published on Sep 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+