Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఇట్స్ టైమ్ టు ప్లే క్రికెట్.. కుటుంబంలో వివాదాలు రావడం సహజమే'

Row affected me and family, but time to focus back on cricket: Mithali Raj

హైదరాబాద్: 'ఇట్స్ టైమ్ టు ప్లే క్రికెట్' అంటోంది మిథాలీ రాజ్. గతాన్ని మరిచి మళ్లీ క్రికెట్‌ మీదే దృష్టి పెట్టాలంటూ భారత మహిళల వన్డే కెప్టెన్ మిథాలీరాజ్‌ తెలిపింది. కొత్త కోచ్‌ నియామకంతో కోచ్‌ రమేశ్‌ పొవార్‌తో వివాదం ముగిసిన అధ్యాయమని ఆమె పేర్కొంది. ' ఈ వివాదం చేదు అనుభవాన్నిచ్చింది. ఇది మా అందరినీ బాగా ఇబ్బందిపెట్టింది. ఇప్పుడైతే అంతా కుదుటపడింది. ఇక పూర్తిగా ఆటపై, జట్టుపై దృష్టిపెడతా' అని మిథాలీ చెప్పింది. టీ-20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తో విభేదాలను అంత సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం లేదని భారత మహిళా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్‌ చెప్పుకొచ్చింది.

15 మందితో కూడిన కుటుంబం

15 మందితో కూడిన కుటుంబం

అవి కు టుంబంలో ఉండే సమస్యల్లాంటివేనని చెప్పింది. ‘సహాయ సిబ్బందిని కూడా కలిపితే అది జట్టుకాదు.. 15 మందితో కూడిన కుటుంబం. సహజంగానే ఫ్యామిలీలో అభిప్రాయ భేదాలుంటాయి. అందరికీ ఒకే రకమైన ఆలోచనలు ఉండవు. గతంలో కొన్ని సమస్యలు ఉన్నాయి.. కానీ మళ్లీ అలాంటి పరిస్థితులు చోటు చేసుకోవని' శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్‌ చెప్పింది.

మహిళల క్రికెట్‌కు మంచిది కాదు

మహిళల క్రికెట్‌కు మంచిది కాదు

‘తుది జట్టులో చోటు, కోచ్‌తో వివాదం ఇంత పెద్దదవడం మహిళల క్రికెట్‌కు మంచిది కాదు. ఆటతీరు కంటే క్రికెటేతర అంశాలే చర్చనీయాంశం కావడం... ఆటకు ఇబ్బందికరం. కివీస్‌ పర్యటన కోసం సన్నద్ధం కావాలి. సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలి' అని హైదరాబాదీ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ చెప్పింది. టీ20 వరల్డ్‌కప్‌ సందర్భంగా కోచ్‌ రమేష్‌ పొవార్‌, మిథాలీ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి.రాజ్‌పై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు వచ్చే నెలలో జరగనున్న న్యూజిలాండ్‌ టూర్‌కు ఆమెనే వన్డే టీమ్‌ కెప్టెన్‌గా కొనసాగించడంతోపాటు టీ20ల్లోనూ చోటు కల్పించారు.

కోచ్‌ రామన్‌కు సహకారం అందించాలి

కోచ్‌ రామన్‌కు సహకారం అందించాలి

‘జరిగిన పరిణామాలు ఎవరికీ మంచివి కావు. పరిస్థితులు కుదుటపడ్డాయని కచ్చితంగా చెప్పగలను. ఇక ఆటపైనే దృష్టంతా' అని రాజ్‌ చెప్పింది. కొత్త కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌కు తగిన సహకారం అందించాల్సిన అవసరం ఉందని మిథాలీ వివరించింది. క్రికెటర్లు, సహాయ సిబ్బంది అంతా కలిసి ఓ క్రికెట్‌ కుటుంబంగా మెలుగుతామని, అయితే అప్పుడప్పుడు భేదాభిప్రాయాలు రావడం సహజమని చెప్పింది.

ఇంతకుముందు జాతీయ క్రికెట్‌ అకాడమీలో కలిశా

ఇంతకుముందు జాతీయ క్రికెట్‌ అకాడమీలో కలిశా

‘ఒక కుటుంబంలో అందరూ ఒకేలా ఆలోచించరు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అయితే ఆట ముందు ఇవన్నీ పెద్ద సమస్యలేమీ కావు. మా ప్రాధాన్యం క్రికెటే. ఓసారి బరిలోకి దిగగానే ఆటే మా సర్వస్వమవుతుంది. ఆటలో నెగ్గేందుకు అంతా ఒక్కటవుతాం. అప్పుడు జట్టే కనిపిస్తుంది. మంచి ప్రదర్శనే మా లక్ష్యమవుతుంది. ఇతరత్రా అంశాలేవీ గుర్తుండవు' అని మిథాలీరాజ్‌ తెలిపింది. కొత్త కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌పై ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుందని, ఇంతకుముందు జాతీయ క్రికెట్‌ అకాడమీలో కలిశానని పేర్కొంది. జనవరి 24న ప్రారంభమయ్యే న్యూజిలాండ్‌ పర్యటనలో భారత్‌ 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.

Story first published: Sunday, December 23, 2018, 12:46 [IST]
Other articles published on Dec 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+