6, 6, 6, 6, 6,.. యువీ రికార్డు మిస్, చివరి బంతికి ఊహించని ట్విస్ట్! (వీడియో)
మేజర్ లీగ్ క్రికెట్ ఆరో మ్యాచ్‌లో సియాటెల్ ఓర్కాస్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ జట్ల మధ్య హై-వోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ విధ్వంసకర బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ స్టేడియంలోకి అడుగుపెట్టడమే లక్ష్యంగా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 11 బంతుల్లోనే 37 పరుగులు చేసి సియాటెల్ ఓర్కాస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో భాగంగా రోవ్‌మన్ పావెల్ ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు.
ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసేందుకు సియాటెల్ ఓర్కాస్ శ్రీలంక ఆల్‌రౌండర్ దసున్ శనక బంతిని అందుకున్నాడు. అయితే ఆ ఆ ఓవర్లో తనకు ఎలాంటి పరాభవం ఎదురుకాబోతుందో శనక అస్సలు ఊహించలేదు. క్రీజులో ఉన్న రోవ్‌మన్ పావెల్ మొదటి బంతి నుంచే తన పవర్ హిట్టింగ్‌ను మొదలుపెట్టాడు. దసున్ శనక వేసిన మొదటి స్లోయర్ షార్ట్ డెలివరీని డీప్ మిడ్-వికెట్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత రెండో బంతిని కూడా లాంగ్-ఆన్ మీదుగా గగనతలంలోకి పంపించి బ్యాక్-టు-బ్యాక్ సిక్సర్లు నమోదు చేశాడు.

దసున్ శనక ఒత్తిడికి లోనై మూడో బంతిని రౌండ్ ద వికెట్ నుంచి షార్ట్‌గా వేయగా.. రోవ్‌మన్ పావెల్ అంతే దీటుగా ఫ్రంట్ ఫుట్‌పైకి వచ్చి మిడ్-వికెట్ మీదుగా బౌండరీ అవతలికి పంపించి సిక్సర్ల హ్యాట్రిక్ పూర్తి చేశాడు. నాలుగో బంతికి కూడా కథ మాత్రం మారలేదు. శనక వేసిన గుడ్ లెంగ్త్ బంతిని పావెల్ లాంగ్-ఆఫ్ మీదుగా స్టాండ్స్‌లోకి పంపాడు. ఇక ఐదో బంతికి దసున్ శనక యార్కర్ వేయడానికి ప్రయత్నించగా.. అది ఫుల్‌టాస్‌గా మారింది. దాన్ని పావెల్ లాంగ్-ఆన్ మీదుగా సిక్సర్‌గా మలచడంతో ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు నమోదయ్యాయి. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులంతా ఓ సరికొత్త చరిత్రను చూసేందుకు సీట్ల నుంచి లేచి నిలబడ్డారు.
యువరాజ్ సింగ్ లాగా ఒకే ఓవర్లో 6 సిక్సర్ల రికార్డును సమం చేయడానికి రోవ్‌మన్ పావెల్‌కు కేవలం ఒకే ఒక్క బంతి మిగిలి ఉంది. అందరి కళ్లు ఆఖరి బంతిపైనే ఉన్నాయి. ఈ తరుణంలో శనక తెలివిగా వ్యవహరించి బంతి వేగంలో మార్పు చేస్తూ బౌన్సర్ వేశాడు. ఆ బంతిని కూడా లెగ్-సైడ్ లాగాలనే ప్రయత్నంలో రోవ్‌మన్ పావెల్ టైమింగ్ మిస్సయ్యాడు. బంతి బ్యాట్ పైభాగానికి తగిలి గాల్లోకి బాగా ఎత్తుగా లేచింది. షార్ట్ థర్డ్-మ్యాన్ వద్ద నిలబడిన ఒట్నీల్ బార్ట్‌మన్ ఎలాంటి తప్పు చేయకుండా ఆ కష్టమైన క్యాచ్‌ను అందుకోవడంతో పావెల్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. పావెల్ తన 37 పరుగుల ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 1 ఫోర్ బాదాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications