హిందీలో తిట్టిన రాస్ టేలర్, నవ్వేసిన కోహ్లీ: సంబరం ఇలా.. (పిక్చర్స్)
కోల్‌కతా: క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడుతుంటారు. అలాగే, రెండో టెస్టు సందర్భంగా క్రీజులో కుదురుకున్న భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైండ్‌ను డైవర్ట్ చేసేందుకు న్యూజిలాండ్ కెప్టెన్ రాస్ టేలర్ సైతం అదే మార్గం ఎంచుకున్నాడు.
కోహ్లీని అతను ఇంగ్లీష్‌లో అనకుండా హిందీలో అనడం గమనార్హం. ఇంగ్లీష్‌లో తిడితే అర్థం కాదనుకున్నాడో ఏమో కానీ హిందీ మార్గాన్ని ఎంచుకొని తిట్టాడు. కోహ్లీ కాళ్లకు బాల్ తగిలిన సమయంలో ఎల్బీడబ్ల్యూ కోసం టేలర్ అపీల్ చేయగా అంపైర్ తిరస్కరించినప్పుడు ఇది జరిగింది. టేలర్ మాటలకు కోహ్లీ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ అవుతోంది.

కాన్పూర్‌లో
సొంతగడ్డపై తమకు తిరుగులేదని భారత క్రికెట్ జట్టు మరోసారి నిరూపించింది. న్యూజిలాండ్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ 178 పరుగుల తేడాతో గెలుపొంది మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అంతకముందు కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టులో కూడా భారత్ 197 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయాలతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి భారత్ అగ్రస్థానానికి చేరుకుంది.

సోమవారం
ఓవర్ నైట్ స్కోరు 227/8తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ తొలి సెషన్‌లోనే 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 112 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని 376 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్‌కు భారత్ నిర్దేశించింది.

టామ్
కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు టామ్ లాథమ్ (74), మార్టిన్ గప్తిల్ (24) నిలకడగా ఆడి తొలి వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమిచ్చారు. అయితే అశ్విన్ బౌలింగ్‌లో గప్తిల్ ఔటవగా, అనంతరం వచ్చిన హెన్రీ (24)తో కలిసి రెండో వికెట్‌కి లాథమ్ మరో 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆ జట్టు మెరుగైన స్థితిలో కనిపించింది.

న్యూజిలాండ్
అయితే న్యూజిలాండ్ స్కోరు 104 వద్ద హెన్రీ ఔటవగా, కెప్టెన్ టేలర్ (4) మరోసారి వైఫల్యాల బాట కొనసాగించడంతో ఆ జట్టులో కంగారు మొదలైంది. మధ్యలో లూక్ రోంచి (32) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసినా శాంట్నర్ (9), వాట్లింగ్ (1) వరుసగా పెవిలియన్ చేరాడు.

వచ్చేసింది.
దీంతో మ్యాచ్ దాదాపు భారత్ చేతుల్లోకి వచ్చేసింది. చివర్లో మాట్ హెన్రీ (18), జీతన్ పటేల్ (2), ట్రెంట్ బౌల్ట్ (4) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో కివీస్ ఇన్నింగ్స్‌కు 197 పరుగుల వద్ద తెరపడింది.

అర్ధశతకాలు
రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్ధశతకాలు బాదిన భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సాహా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ టెస్టులో భారత్ పేస్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ (6/76), మహ్మద్ షమీ (6/116) కివీస్ పతనంలో కీలక పాత్ర పోషించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications