రైనాకు సెహ్వాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
నవంబర్ 27 సురేశ్ రైనా పుట్టినరోజుని పురస్కరించుకుని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ‘మీరు ఐనా (అద్దం) చూశారా అంటే.. నేను రైనాను చూశానని జవాబిస్తాను.. సురేశ్ రైనాకు జన్మదిన శుభాకాంక్షలు' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
సురేశ్ రైనా కృతజ్ఞతలు
సెహ్వాగ్ ట్వీట్‌కు సురేశ్ రైనా కృతజ్ఞతలు తెలియజేశాడు.
గందరగోళానికి గురి చేసిన రాస్ టేలర్
అయితే ఇదే సమయంలో న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ ట్విట్టర్‌లో వీరిద్దరిని గందరగోళానికి గురి చేశాడు. న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ నుంచి '@ImRaina @virendersehwag' అని టైప్ చేసి సందేశం లేకుండానే ఓ ట్వీట్ వచ్చింది.
‘టేలర్ జీ ఏమైంది
దీంతో సెహ్వాగ్ వెంటనే ‘టేలర్ జీ ఏమైంది. ఏమీ లేకుండానే ట్యాగ్ చేశారు. మధ్యలో మరో పనేమైనా దొరికిందా' అంటూ ట్విట్టర్‌లో మరో ట్వీట్ పోస్టు చేశాడు.
నా ఫోన్ మా అమ్మాయి తీసుకొంది
సెహ్వాగ్ ప్రశ్నకు రాస్‌టేలర్ నవ్వుతూ ‘సారీ.. నా ఫోన్ మా అమ్మాయి తీసుకొంది' అంటూ గందరగోళానికి స్పందించాడు.
త్వరగా కోలుకోవాలని బ్రదర్
చివరకు టేలర్ స్పందనగా సెహ్వాగ్ 'నేను బాగున్నాను. కన్ను ఎలా ఉంది. త్వరగా కోలుకోవాలని బ్రదర్. మీరు సిరిస్ గెలవాలి' అంటూ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











