సెహ్వాగ్‌కు ధీటుగా: రాస్ టేలర్‌కు హిందీ నేర్పింది ఎవరో తెలుసా?
హైదరాబాద్: భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన ముగిసింది. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం భారత్‌కు వచ్చిన న్యూజిలాండ్ జట్టు తమ అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సిరిస్‌లో భాగంగా న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ భారత అభిమానులను ఎంతోగానో ఆకట్టుకున్నాడు.
ముఖ్యంగా ఈ సిరిస్‌లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, రాస్ టేలర్‌ల మధ్య చోటు చేసుకున్న ట్విట్టర్ హిందీ సంభాషణ అభిమానులను అలరించిందనే చెప్పాలి. ఎంతలా అంటే... రాస్ టేలర్ హిందీకి ముగ్ధుడైన సెహ్వాగ్ ఏకంగా అతడికి ఆధార్ ఇస్తారా అని అడిగేలా!
హిందీలో ట్వీట్లు చేసేందుకు టేలర్‌కు సాయం చేసింది ఎవరో ఇప్పుడు తెలిసిపోయింది. వారెవరో కాదు న్యూజిలాండ్ జట్టులో ఉన్న భారత్ సంతతికి చెందిన క్రికెటర్ ఇష్ సోధి. ఇష్ సోధి పుట్టింది పంజాబ్‌లోని లూధియానాలో. ప్రస్తుతం న్యూజిలాండ్ తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్నాడు.
టేలర్ ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు
ఇష్ సోధికి హిందీ బాగా వచ్చు. వ్యాపారాల నిమిత్తం ఇష్ సోధి కుటుంబం అంతా న్యూజిలాండ్‌లో స్థిరపడింది. సోధి బంధువులు చాలామంది భారత్‌లోనే ఉన్నారు. మరొకరు దేవ్. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సహాయక బృందంలో సభ్యుడు. ఆయన కూడా భారత సంతతికి చెందిన వ్యక్తే. వీరిద్దరితో కలిసి ఉన్న ఫోటోని రాస్ టేలర్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.

భారత్ అంటే ఎంతో సంతోషం
'ఎప్పటిలాగే భారత్ అంటే ఎంతో సంతోషం. వీరేంద్ర సెహ్వాగ్‌తో హిందీలో సరదా సంభాషణకు సాయం చేసిన వారు ఈ చిత్రంలో ఉన్నారు. దేవ్, ఇష్ సోధికి ధన్యవాదాలు. చివరి సందేశంతో దీన్ని ముగిస్తున్నాను: ఉతకడం.. కుట్టడం వచ్చే సమయంలో వెళ్లిపోతున్నా' అని టేలర్ తన ఇనిస్టాగ్రామ్‌లో భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశాడు.

అంతా ఐపీఎల్ వల్లే!
భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రారంభం అయిన ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లు ఈ టోర్నీకి ఎంపికయ్యారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ దేశాల నుంచి వచ్చిన ఆటగాళ్లు భారత్‌ను తమ రెండో ఇంటిగా భావిస్తారు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ గతంలో ఎన్నోసార్లు ఈ మాట చెప్పిన సంగతి తెలిసిందే.

భారత్ అంటే రాస్ టేలర్‌కు ఎంతో ప్రత్యేకం
ఇక, రాస్‌టేలర్ విషయానికి వస్తే, ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున సెహ్వాగ్‌తో కలిసి ఆడారు. అంతేకాదు భారత్ అంటే రాస్ టేలర్‌కు ఎంతో ప్రత్యేకం. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ జట్టు తమ దేశానికి వెళ్లడానికి ముందే వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 'ఉతికిన తర్వాత కుట్టాలి.. న్యూజిలాండ్ చాలా బాగా ఆడింది. కివీస్ చేతిలో ఓడిపోవడం ఎప్పుడూ బాధాకరంగా అనిపించదు. ఎందుకంటే చాలా మంచోళ్లు. టీమిండియాకు ఇది అద్భుత విజయం' అని.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications