రాస్ టేలర్ ఆత్మకథలో ఆసక్తికర విషయం.. మ్యాచ్ ముందు రోజు ఆ వంటకం తింటే అంతేనటా..!

న్యూజిలాండ్ క్రికెట్‌లోని జాత్యహంకారం గురించి రాస్ టేలర్ ఆత్మకథలో వెల్లడించిన విషయం బాగా వైరలైన సంగతి తెలిసిందే. ఇక అతను తన గురించి ఆత్మకథలో పేర్కొన్న మరొక విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈసారి జాత్యహంకారం లాంటి సీరియస్ విషయం కాదు. ఈసారి చాలా సరదా విషయాన్ని పంచుకున్నాడు. మ్యాచ్‌కు ముందు రోజు డక్ ఫ్రై గానీ డక్ మీల్స్ తింటే తాను మ్యాచ్‌లో డకౌట్ అయ్యే వాడినని గుర్తుచేసుకున్నాడు. 2007లో ఇంగ్లాండ్‌తో వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి తాను డక్ మీల్స్ తినడంతో తాను డకౌట్ అయ్యానని టేలర్ గుర్తుచేసుకున్నాడు. లియామ్ ప్లంకెట్ బౌలింగ్లో తొలి బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత ఎప్పుడు మ్యాచ్ ఉన్నా ముందు రోజు డక్ మీల్స్ తినకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.

నా మొట్టమొదటి వరల్డ్ కప్ మ్యాచ్‌కు ముందు
'2007లో సెయింట్ లూసియాలో ఇంగ్లాండ్‌తో జరిగిన నా మొట్టమొదటి వరల్డ్ కప్ మ్యాచ్‌కు ముందు రాత్రి నేను చైనీస్ రెస్టారెంట్‌కి వెళ్లా. నేను అక్కడ మంచి ఫ్రైగా చేసిన క్రిస్పీ డక్ ఫ్రైని తిన్నాను. ఇది నాకు ఇష్టమైన వంటకం. ఇక తర్వాతి రోజు మ్యాచ్‌లో లియామ్ ప్లంకెట్ నేను బ్యాటింగ్ దిగినప్పుడు పూర్తి అవుట్‌స్వింగర్ వేశాడు. నేను కవర్ డ్రైవ్ కోసం చూశా. అది ఎడ్జ్ అయింది. తద్వారా ఆండ్రూ ఫ్లింటాఫ్ చేతికి క్యాచ్ ఔట్‌గా దొరికిపోయాను. అప్పుడు పెట్టుకున్న రూల్ నంబర్ వన్ : మ్యాచ్ ముందు రోజు రాత్రి డక్ చేయవద్దు' అని టేలర్ చెప్పాడు.

నా ఫ్రెండ్స్ కన్విన్స్ చేసి తినిపించారు
ఆ తర్వాత ఓసారి మరో మ్యాచ్‌లో డకౌట్ అయిన మరో సంఘటనను కూడా రాస్ టేలర్ గుర్తు చేసుకున్నాడు. 'మళ్లీ ఓసారి ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్‌కి వెళ్లా. నేను తర్వాత రెండు రోజులకు మ్యాచ్ ఆడాల్సి ఉంది. అందువల్ల అక్కడ నేను డక్ ఫ్రై వంటకాన్ని ముట్టబోనని చెప్పాను. అయితే నా ఫ్రెండ్స్ నన్ను కన్విన్స్ చేశాడు. నీ రూల్ ప్రకారం.. మ్యాచ్‌కు ముందు రోజు మాత్రమే డక్ మీల్స్ తినవద్దు.. కానీ ఇప్పుడు రెండు రోజులున్నాయి. ఎంచక్కా తినొచ్చు అంటూ నా చేత డక్ ఫ్రై లాగించేలా చేశారు. అయితే రెండు రోజుల మ్యాచ్‌లో మళ్లీ నేను గోల్డెన్ డక్ అయ్యాను. దీన్ని బట్టి అప్పటి నుంచి మ్యాచ్‌కు కొన్న రోజుల ముందు నుంచే డక్ మీల్స్ తినడం మానేశా'అని రాస్ టేలర్ చెప్పాడు.

డ్రెస్సింగ్ రూంలో రాస్ టేలర్‌కు చేదు అనుభవాలు
న్యూజిలాండ్ క్రికెట్ టీంలో ఉండే చీకటి కోణాలను తన ఆత్మకథ రాస్ టేలర్ బ్లాక్ అండ్ వైట్‌లో టేలర్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. జట్టులో జరిగే జాత్యాహంకార ధోరణిని బట్టబయలు చేశాడు. తన పట్ల జట్టు ప్లేయర్లు వ్యవహరించే రేసిజాన్ని వెల్లడించాడు. స్పోర్టివ్ నెస్ పేరిట తనను కించపరిచేలా ఎన్నో మాటలు అనేవారని, జట్టు కోసం అన్ని అవమానాలను భరించానని టేలర్ తెలిపాడు. తనను నువ్వు సగం మాత్రమే మావోడివి, మిగతా సగం ఏంటో నువ్వే తేల్చుకో అంటూ హేళన చేసేవారని, న్యూజిలాండ్ క్రికెట్ తెల్లవాళ్ల ఆట అని డ్రెస్సింగ్ రూంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను అతను పంచుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications