పందిలా మెక్కాను అనుకున్నాడేమో.. బ్యాటింగ్ టైంలో అంత పెద్ద మాట అన్నాడు.. సెహ్వాగ్ గురించి రాస్ టేలర్

2022లో తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన రాస్ టేలర్ రాసిన ఆత్మకథ 'బ్లాక్ & వైట్' చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అతని జీవితంలోని చాలా ఇంట్రెస్టింగ్ తింగ్స్ అతను తన బుక్‌లో పేర్కొన్నాడు. అందులో కొన్ని దిగ్భ్రాంతికరమైన, వినోదభరితమైన విషయాలను వెల్లడి చేశాడు. సమోవా వారసత్వానికి చెందిన టేలర్ తన పుస్తకంలో న్యూజిలాండ్ డ్రెస్సింగ్ రూమ్‌లో జాత్యహంకారాన్ని ఎదుర్కొన్నట్లు పేర్కొన్నాడు.
2011లో ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నప్పుడు ఒక మ్యాచ్‌లో డకౌట్ అయిన తర్వాత ఆర్ఆర్ ఓనర్ తనను కొట్టాడని కూడా పేర్కొన్నాడు. అయితే తాజాగా తనకు బ్యాటింగ్ విషయంలో వీరేంద్ర సెహ్వాగ్ నుంచి లభించిన ఓ ఆసక్తికర సలహాను తన బుక్‌లో పంచుకున్నాడు.

2012లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున రాస్ టేలర్
టేలర్ 2012లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) జట్టు తరఫున ఐపీఎల్లో ఆడాడు. అతను మ్యాచ్‌లలో పరుగుల కోసం తీవ్రంగా కష్టపడుతుండడం చూసిన భారత లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ టేలర్‌కు ఓ అదిరిపోయే ఐడియా ఇచ్చాడు. రొయ్యలు తినేటప్పుడు ఎలా ఆనందిస్తూ తింటావో అలాగే బ్యాటింగ్ చేయమని టేలర్‌కు సెహ్వాగ్ చెప్పాడట. అంతకుముందు సెహ్వాగ్ మరికొందరు సహచరులతో కలిసి టేలర్ రెస్టారెంట్‌కు వెళ్లగా అక్కడ ప్రాన్స్ ఫ్రై వంటకాలను తాను చాలా ఆబగా తింటుండడాన్ని సెహ్వాగ్ గమనించాడని కూడా టేలర్ పేర్కొన్నాడు

వీడేంటీ పందిలా తింటున్నాడు..?
‘మేము ఓ రోజు సెహ్వాగ్ యొక్క రెస్టారెంట్‌కు వెళ్లాం. అక్కడ చాలా మంచి మంచి వంటకాలను ఆస్వాదించాం. తింటూ ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశాం. ఇక మా ముందున్న వంటకాలన్నీ బాగుండడంతో ఎంత తింటున్నామో ఏం తింటున్నామో కూడా తెలియలేదు. ముఖ్యంగా ప్రాన్స్. నేను వాటిని నమిలి మింగుతూనే ఉన్నా.
ఆ టైంలో నేను మ్యాచ్ మీదే ఫోకస్ చేశా. అయితే సెహ్వాగ్ నన్ను గమనించినట్లున్నాడు. వీడేంటీ పందిలా మెక్కుతున్నాడని బహుశా అతను అనుకోని ఉండొచ్చేమో (సరదాగా). సెహ్వాగ్ నన్ను గమనిస్తున్న విషయాన్ని నేను గ్రహించలేదు' అని టేలర్ తన ఆత్మకథలో రాశాడు.


సెహ్వాగ్ దంచుతుంటే మేమేమో తటపటాయిస్తున్నాం
‘మేము మరుసటి రోజు మ్యాచ్ ఆడాం. సెహ్వాగ్ ఒక్కడే దంచికొడుతున్నాడు. నాతో సహా విదేశీ బ్యాటర్లు ఎవరూ కుదురుగా ఆడట్లేదు. అప్పటికే వేలంలో నాకు భారీగా ధర దక్కడంతో నేను ఎలాగైనా రాణించాలని చాలా తడబడుతూ ఆడుతున్నాను. కాస్త భయపడ్డాను కూడా. నేను ఒత్తిడితో బ్యాటింగ్ చేస్తుండగా.. సెహ్వాగ్ అవతలి ఎండ్‌లో నుంచి వచ్చి చాలా రిలాక్స్‌గా చెప్పాడు.
రాస్ పెద్ద ఇబ్బంది పడకు. నువ్వు ప్రాన్స్ తింటున్నప్పుడు ఎంత హ్యాపీగా తింటావో అలాగే బ్యాటింగ్ చేయి హ్యాపీగా. పోయేదేముంది అన్నాడు. అప్పుడు అనిపించింది. రొయ్యలు అంటే నాకిష్టం. అలాగే క్రికెట్ అంటే కూడా నాకిష్టం. అందువల్ల హ్యాపీగా సరదాగా ఆడాలని తెలిసింది. ఆ సజెషన్ నాకు చాలా ఉపయోగపడింది.
అప్పటి నుంచి మేం ఎప్పుడు ఎదురైన మాకు నాకు రొయ్యలే గుర్తొస్తాయి.'అని చెప్పాడు. ఇకపోతే రాస్ టేలర్ ఢిల్లీ తరఫున ఒక సీజన్ మాత్రమే ఆడాడు. అతను 16మ్యాచ్‌ల్లో 256పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications