Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వందవ టెస్ట్ మ్యాచ్‌.. టేలర్‌కు వంద వైన్‌ బాటిళ్లు (వీడియో)!!

Ross Taylor presented with 100 wine bottles to mark his 100th Test appearance

వెల్లింగ్టన్‌: భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ బ్యాట్స్‌మ‌న్ రాస్ టేల‌ర్ ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు. శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టు టేలర్‌ కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్. దీంతో మూడు ఫార్మాట్‌ (టెస్టు, వ‌న్డే, టీ20)లలో వందేసి మ్యాచ్‌లు ఆడాడు. తాజా టెస్ట్ మ్యాచ్ ద్వారా 35 ఏళ్ల టేలర్‌ అరుదైన రికార్డును చేరుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

టేలర్‌ ప్రపంచ రికార్డు:

టేలర్‌ ప్రపంచ రికార్డు:

రాస్ టేల‌ర్ ఇటీవల భారత్‌తో ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌లో వందో మ్యాచ్‌ పూర్తి చేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో ఇప్పటికే 231 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఈ రోజు వెల్లింగ్టన్‌ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టు.. టేలర్‌ కెరీర్‌లో వందో టెస్టు. దీంతో మూడు ఫార్మాట్లలో వంద మ్యాచులు ఆడిన తొలి క్రికెటర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. 100వ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా శుక్రవారం టేలర్‌ త‌న ఫ్యామిలీతో క‌లిసి మైదానంలోకి వ‌చ్చాడు. టేలర్‌ జెర్సీ నంబర్ 'మూడు'నే అతని కూతురు, కుమారుడు వేసుకుని మైదానంలోకి వచ్చారు. టేలర్‌ మైదానంలోకి అడుగుపెడుతూనే అందరికి హాయ్ చెప్పాడు.

వంద వైన్‌ బాటిళ్లు:

వంద టెస్టులు ఆడిన రాస్‌ టేలర్‌కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అద్భుతమైన బహుమతిని ఇచ్చింది. టేలర్‌కు వంద వేర్వేరు వైన్‌ బాటిళ్లను గుర్తుగా ఇచ్చింది. ప్రతి టెస్టుకు ఒక బాటిల్‌ అన్న ఉద్దేశంతో.. అతనికి వాటిని కివీస్ బోర్డు అందజేసింది. ఆ దేశ మాజీ ప్లేయర్‌ ఇయాన్‌ స్మిత్‌ వంద వైన్‌ బాటిళ్లను టేలర్‌కు బహుకరించాడు. ఈ సమయంలో జట్టు సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. బాటిళ్లను అందుకున్న టేలర్‌ ఆనందం వ్యక్తం చేసాడు.

కంపెనీకి రావాలా?:

కంపెనీకి రావాలా?:

ప్రస్తుతం టేలర్‌కు బహుకరించిన వైన్‌ బాటిళ్ల వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియో అనేక లైకులు, కామెంట్లను పొందింది. క్రికెట్ అభిమానులు టేలర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొందరు ఫాన్స్ మాత్రం టేలర్‌ను ఆటపట్టించారు. 'వంద వైన్‌ బాటిళ్లను ఏం చేసుకుంటావ్.. ఏదైనా సాయం కావాలా' అని ఓ ఫ్యాన్ ట్వీట్ చేయగా.. 'కంపెనీకి రావాలా టేలర్‌' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు.

వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగులు:

వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగులు:

రాస్ టేలర్‌ కివీస్‌ తరఫున వన్డేలు, టెస్టుల్లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా కూడా కొనసాగుతున్నాడు. వన్డేల్లో 7,174 పరుగులు చేసిన టేలర్‌.. టెస్టుల్లో 8,570 పరుగులు చేశాడు. మాజీ కెప్టెన్ బ్రెండన్‌ మెక్‌కలమ్‌, ఓపెనర్ మార్టిన్‌ గప్తిల్‌ పొట్టి క్రికెట్‌లో టేలర్‌ కన్నా ఎక్కువ పరుగులు చేశారు. కివీస్‌ తరఫున 40 సెంచ‌రీల‌తో ఆ జ‌ట్టు త‌ర‌పున అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన క్రికెట‌ర్‌గా కూడా ఘ‌న‌త వ‌హించాడు. ఇటీవ‌లే 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు తాను ఆడ‌తాన‌ని టేల‌ర్ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

Story first published: Friday, February 21, 2020, 18:14 [IST]
Other articles published on Feb 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+