మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్

హైదరాబాద్: న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ రాస్ టేలర్ మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురయ్యాడు. సిడ్నీ వేదికగా సోమవారంతో ముగిసిన మూడో టెస్టులో న్యూజిలాండ్ 279 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాస్ టేలర్ భావోద్వేగానికి లోనయ్యాడు.
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేయడంతో రాస్ టేలర్.. న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఈ మీడియా సమావేశంలో తన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్లు చెప్పాలని మీడియా ప్రతినిధులు కోరగా మాట్లాడకుండా గదిలోకి వెళ్లిపోయాడు.

క్షమాపణలు చెప్పిన రాస్ టేలర్
అనంతరం ఎనిమిది నిమిషాత తర్వాత తిరిగొచ్చి క్షమాపణలు తెలిపాడు. చాలాసేపు మౌనంగా ఉండి తనను తాను తమాయించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఉబికి వస్తున్న కన్నీళ్లను నియంత్రించుకోలేక కంట కన్నీరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత తాను గదిలోకి ఎందుకు వెళ్లిందీ రాస్ టేలర్ చెప్పాడు.

ఫ్లెమింగ్ రికార్డును బద్దలు కొట్టిన రాస్ టేలర్
టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ రికార్డును అధిగమించిన తర్వాత తన మెంటార్ మార్టిన్ క్రో గుర్తుకు రావడంతో భావోద్వేగంతో కన్నీళ్లు బయటకు వచ్చాయని, అందుకనే గదిలోకి వెళ్లిపోయినట్టు తెలిపాడు. న్యూజిలాండ్ మాజీ క్రికెటరైన మార్టిన్ క్రో కేన్సర్‌తో బాధపడుతూ 2016లో కన్నుమూశారు.

ఒక్క టెస్టు మ్యాచ్
తాను ఒక్క టెస్టు మ్యాచ్ అయినా ఆడాలని అనుకున్నానని, కానీ ఈ రోజు అత్యధిక టెస్టు పరుగులు చేసిన న్యూజిలాండ్ క్రికెటర్‌గా ఎదిగానని తెలిపాడు. దీనికి కారణం తన మెంటార్ మార్టిన్ క్రో అని, అతడే తనకు లక్ష్యాన్ని నిర్దేశించాడని టేలర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు.
రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేయడంతో
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన చివరిదైన మూడో టెస్టులో రాస్ టేలర్ న్యూజిలాండ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 22 పరుగులు సాధించిన రాస్ టేలర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 22 పరుగులే సాధించి నిరాశ పరిచినప్పటికీ ఓ ఈ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

రాస్ టేలర్ ఖాతాలో 7175 పరుగులు
అంతకముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్(7,172) పేరిట ఉండేది. సిడ్నీలో ఆ రికార్డుని రాస్ టేలర్ అధిగమించాడు. ప్రస్తుతం రాస్ టేలర్ 7,175 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... బ్రెండన్ మెకల్లమ్(6,453) మూడో స్థానంలో కేన్ విలియమ్సన్(6,379), మార్టిన్ క్రో(5,444)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications