
స్టోక్స్‌కు 18ఏళ్లు ఉన్నప్పుడు
'స్టోక్స్‌కు అప్పుడు 18ఏళ్లు ఉంటాయనుకుంటా. అతను మా న్యూజిలాండ్ పర్సనే. ఇంగ్లీష్ కౌంటీల్లో బానే ఆడుతున్నావు మన న్యూజిలాండ్‌కు వచ్చి ఆడాలనుకుంటున్నావా అని నేను అతనిని అడిగాను. అతను కూడా మీరు చెప్పాలా మాస్టరు.. తప్పకుండా అన్నట్టు చాలా ఆసక్తి కనబరిచాడు. ఇక నేను మరేం ఆలోచించకుండా వెంటనే న్యూజిలాండ్ క్రికెట్ సీఈవో జస్టిన్ వాన్‌కి స్టోక్స్ అనే ప్లేయర్ మనోడే.. మస్తు ఆడతాడు.. మన టీంలోకి తీసుకుంటే పనికొస్తాడు అని మెసేజ్ పంపించా. ' అని టేలర్ తన పుస్తకంలో రాశాడు,

అది కుదరని పని
అయితే జస్టిస్ వాన్ మాత్రం అంత సీరియస్‌గా ఆ విషయాన్ని తీసుకోలేదు. ఏంటీ స్టోక్స్‌ను డైరెక్ట్ జాతీయ జట్టులోకి తీసుకుందామంటున్నావా.. అది కుదరని పని కానీ ఓ పని చేద్దాం. మళ్లీ అతన్ని న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్లో ఆడాలని చెప్పు. అలా కొన్నేళ్లు ఆడాక ఒకవేళ బాగా ఆడితే సెలెక్ట్ చేద్దాం. అంతేగానీ డైరెక్ట్ ఎలా తీసుకుంటాం టేలర్ అంటూ వాగన్ తాను ఆ పని చేయలేనని చెప్పాడని రాస్ పేర్కొన్నాడు.

అప్పటికే ఇంగ్లాండ్‌లో సెటిలైన స్టోక్స్ ఫ్యామిలీ
'ఇక వాగన్ లాంటోడికి చెప్పి వేస్ట్ అని నేను మనసులో అనుకున్నా. స్టోక్స్ మళ్లీ మొదటి నుంచి రావాలంటున్నాడు. అప్పటికే కౌంటీల్లో బ్రహ్మాండంగా ఆడుతున్న అతన్ని మళ్లీ స్టార్ట్ చేసి రావాలి అంటే అతను ఎందుకు ఆసక్తి చూపుతాడు. అప్పటికే ఇంగ్లాండ్‌లో స్టోక్స్ వాళ్ల ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది.' అని టేలర్ పేర్కొన్నాడు. ఇకపోతే న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించిన స్టోక్స్ వాళ్ల నాన్న రగ్బీ ఆటగాడు గెరార్డ్ స్టోక్స్. అతను 12ఏళ్ల వయస్సులో కోచ్ పర్పస్‌లో ఇంగ్లాండ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు.

న్యూజిలాండ్‌కు వరల్డ్ కప్ దూరం చేసిన స్టోక్స్
'స్టోక్స్ న్యూజిలాండ్ తరఫున ఆడడానికి చాలా వరకు విల్లింగ్ కనబరిచాడు. కానీ ఈ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారులు అతన్ని అంత పెద్దగా పట్టించుకోలే. స్టోక్స్‌ను కాస్త నమ్మి అవకాశాలు ఇద్దామని ప్రయత్నించలే. ముఖ్యంగా సీఈవో జస్టిస్ వాగన్ మాత్రం తన వల్ల అయ్యే అవకాశం ఉన్నా అతను ఆ పని చేయలేకపోయాడు.' అని టేలర్ పేర్కొన్నాడు. స్టోక్స్ 20ఏళ్ల వయస్సులో 2011లో ఇంగ్లాండ్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇక 2019లో లార్డ్స్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో స్టోక్స్ ఆడిన ఇన్నింగ్స్ నా భూతో నా భవిష్యత్తు. సూపర్ ఓవర్ వరకు దారితీసిన ఆ మ్యాచులో అత్యధిక బౌండరీలు బాదిన జట్టుగా ఇంగ్లాండ్ గెలుపొందింది. ఫైనల్‌లో 84పరుగులతో అజేయంగా నిలిచిన స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications












