రాస్ టేలర్‌కు మూడోసారి 'రిచర్డ్ హ్యాడ్లీ' పతకం!!

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్‌కు ఆ దేశ అత్యున్నత క్రికెట్ పురస్కారం దక్కింది. న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు సర్ రిచర్డ్ హ్యాడ్లీ అవార్డు టేలర్‌కు లభించింది. 10 ఏళ్ల కెరీర్‌లో టేలర్ ఈ ఘనతను మూడోసారి దక్కించుకున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆన్‌లైన్‌లో జరిగిన వర్చువల్ వేడుకల్లో టేలర్‌కు ఈ అవార్డు లభించిన విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

టెస్టుల్లో అత్యధిక పరుగులు:
వరుస రెండు వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరడంలో రాస్ టేలర్ ఎంతో ముఖ్య భూమిక పోషించాడు. గత ఏడాది కాలంలో న్యూజిలాండ్ తరఫున అత్యంత విజయవంతమైన టెస్టు ఆటగాడిగా నిలిచాడు. కివీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా స్టీఫెన్ ఫ్లేమింగ్ను ఈ సీజన్లోనే రాస్ అధిగమించాడు. మరొకవైపు మూడు ఫార్మాట్లలో వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా కూడా టేలర్ రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. మొత్తంగా 2019-20 సీజన్లో మూడు ఫార్మాట్లలో టేలర్ మొత్తం 1,389 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు.

2023 ప్రపంచకప్ ఆడటమే లక్ష్యం:
ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి నిరాశపరిచిందని రాస్ టేలర్ అన్నాడు. 'గడిచిన ఏడాది నా కెరీర్‌లో అద్భుతమైనదిగా నిలిచింది. ఎన్నో ఎత్తు పల్లాలతో నా కెరీర్ ఇంకా సాగుతుండటం ఆనందంగా ఉంది. 2023లో భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడటమే నా ముందున్న లక్ష్యం. వరుసగా రెండు వన్డే ప్రపంచకప్‌లలో మా జట్టు ఫైనల్ చేరడంలో భాగస్వామ్యం అయ్యా. ఇక వరుసగా మూడోసారి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటా. పరుగులు చేయాలనే దాహం. మానసికంగా ధృడంగా ఉండటమే నా సానుకూలాంశం. వయసు అనేది ప్రామాణికం కాదు, అది కేవలం నంబర్ మాత్రమే. నాకు కివీస్ తరుఫున ఇంకా ఆడాలని ఉంది' అని టేలర్ చెప్పాడు.

టేలర్ అద్భుతమైన ఆటగాడు:
రాస్ టేలర్ అద్భుతమైన ఆటగాడని రిచర్డ్ హ్యాడ్లీ ప్రశంసించారు. కరోనా వైరస్ కారణంగా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. 2006లో కివీస్ తరఫున అరంగేట్రం చేసిన టేలర్.. 101 టెస్టులు, 232 వన్డేలు ఆడాడు. ఇక 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు కూడా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టేలర్ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన తొలి టెస్టు ద్వారా వంద టెస్టుల మార్కును చేరాడు. దాంతో ఏ జట్టు తరఫున చూసినా మూడు ఫార్మాట్లలో కనీసం వంద మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications