Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆరోన్ ఫించ్ సెంచరీ వృధా: ఆసీస్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం

Root

హైదరాబాద్: బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది.

అనంతరం 271 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మరో 34 బంతులుండగానే లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ తొలి వికెట్‌కు డేవిడ్ వార్నర్‌ (35)తో కలిసి ఆరోన్ ఫించ్ 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ (18), ట్రావిస్ హెడ్ (7) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు.

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో స్వేచ్ఛగా ఆడుతూ ఆరోన్ ఫించ్ (114 బంతుల్లో 106, 9 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ నమోదు చేశాడు. ఈ సిరిస్‌లో ఫించ్‌కి ఇది రెండో సెంచరీ. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కూడా ఫించ్ సెంచరీలో మెరిశాడు. ఇక, సెంచరీ అనంతరం ప్లంకెట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కారే (27) పరవాలేదనిపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జో రూట్, రషీద్ చెరో 2 వికెట్లు తీసుకోగా... క్రిస్ వోక్స్, ప్లెంకెట్, అలీ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం 271 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు తొలి ఓవర్‌లోనే మిచెల్ స్టార్క్ షాకిచ్చాడు.

ఇన్నింగ్స్ నాలుగో బంతికి ఓపెనర్ జాసన్ రాయ్ (2)ను పెవిలియన్‌కు చేర్చాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో (60), అలెక్స్ హేల్స్ (57)లు హాఫ్ సెంచరీలతో రాణించారు. మరోవైపు స్టార్క్ (4/59) తీస్తున్నప్పటికీ, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ మాత్రం నిలకడగా ఆడారు.

ఈ క్రమంలో మోర్గాన్ (21), జోస్ బట్లర్ (42) పరుగులు చేసి ఫరవాలేదనిపించారు. బెయిర్ స్టో ఔటయ్యాక క్రీజులోకొచ్చిన జో రూట్ (46 నాటౌట్), క్రిస్ వోక్స్ (39) రాణించడంతో 44.2 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి నిర్దేశిత 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆల్ రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న జో రూట్‌కు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఇదిలా ఉంటే ఐదు వన్డేల సిరిస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లోనూ ఆరోన్ ఫించ్ రెండు సెంచరీలు సాధించిన ఆ జట్టు ఓటమి పాలైంది. తొలి వన్డేలో ఫించ్ (107) సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ జట్టు 300కు పైగా స్కోరు చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో వన్డేలో ఫించ్‌(106) పరుగులతో సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఓటమి పాలైంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 19, 2018, 19:58 [IST]
Other articles published on Jan 19, 2018
Read in English: Root guides England home
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+