ప్రపంచంలోనే అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్ కన్నుమూత - ఆయన రికార్డులివే!
Oldest Test Cricketer Died: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్ రాన్ డ్రేపర్ (98 ఏళ్ల 63 రోజులు) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన రాన్ డ్రేపర్.. టాప్ ఆర్డర్ బ్యాటర్ కమ్ అకేషనల్ వికెట్ కీపర్ గా కెరీర్ లో రాణించారు.
ఆ ఇద్దరూ దక్షణాఫ్రికా వారే..
తన అంతర్జాతీయ కెరీర్‌లో కేవలం 2 టెస్ట్ మ్యాచ్‌లు (1950లో ఆస్ట్రేలియాపై) మాత్రమే ఆడిన రాన్ డ్రేపర్.. 25 పరుగులు చేశాడు. అతడి కన్నా ముందు 2016లో 106 ఏళ్ల వయసుగల నోర్మన్ గోర్డాన్, 2021లో 98 ఏళ్ల వయసున్న జాన్ వాట్కిన్స్ తుదిశ్వాస విడిచారు. వీరిద్దరు కూడా దక్షిణాఫ్రికాకు చెందిన వారే కావడం విశేషం. ప్రస్తుతం రాన్ డ్రేపర్ మరణించడంతో ఆస్ట్రేలియాకు చెందిన నీల్ హార్వే (96) అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్ గా నిలిచాడు.

19 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం..
1926 డిసెంబర్ 24న జన్మించిన రాన్ డ్రేపర్.. తన 19 ఏళ్ల వయసులో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. తూర్పు ప్రావిన్స్ తరపున ఆరెంజ్ ఫ్రీ స్టేట్‌పై ఎంట్రీ ఇచ్చాడు. 1949- 50లో ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. రెండు టెస్టులు ఆడి మూడు ఇన్నింగ్స్ లో 25 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా తన కెరీర్ లో 11 శతకాలు, 11 అర్ధ శతకాలతో పాటు 32 క్యాచులు పట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications