IPL 2025: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ప్రదర్శన చేస్తూఅభిమానులను అలరిస్తోంది. తాజాగా సీఎస్కేతో జరిగిన కీలక మ్యాచులో 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లింది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జట్టు విజయం సాధించాక ఆటగాళ్లతో పాటు అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విజయంపై కెప్టెన్ రజత్ పటీదార్ ఆనందం వ్యక్తం చేశాడు. అలాగే మ్యాచ్ చివర్లో విధ్వంసం సృష్టించి, జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన రొమారియో షెఫర్డ్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు.
అదే మా అంతిమ లక్ష్యం..
"మ్యాచ్ చాలా కఠినంగా సాగింది. అయినా, మా బ్యాటర్లు ఆడిన విధానం అద్భుతం. దాని వల్లే ఈ విజయానికి బలమైన పునాది పడింది. బౌలర్లు కూడా చూపిన ధైర్యం అద్భుతం. యశ్ మా జట్టులో కీలక బౌలర్. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్. గతేడాది ఎలా బాగా బౌలింగ్ చేశాడో ఈసారి కూడా అదే స్థాయిలో బాగా చేశాడు. చివరి ఓవర్ అతడికి ఇవ్వడం సరైన నిర్ణయమే. సుయాష్‌పై కూడా నాకు బాగా నమ్మకం ఉంది. ఇప్పటివరకు మంచి ఓవర్లు వేశాడు. ఫలితం దక్కింది. షెపర్డ్ లాగా భారీ సిక్సర్లు కొట్టడం అంత తేలిక కాదు. కానీ అతడిలో శక్తి, నైపుణ్యం రెండూ ఉన్నాయి. అతడి సిక్సర్లను నిజంగా చాలా ఆస్వాదించాను. ఎంగిడి అనుభవజ్ఞుడైన బౌలర్. వైట్-బాల్ క్రికెట్‌లో అతడికి విస్తృత అనుభవం ఉంది. అతడిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రస్తుతం టేబుల్ టాప్‌లో ఉండటం పాజిటివ్ విషయమే. కానీ మా దృష్టి క్వాలిఫికేషన్‌పై కాదు. మిగిలిన మూడు మ్యాచ్‌లు ఎంతో కీలకం. వాటిని గెలవడమే మా అంతిమ లక్ష్యం. ఇక పార్టీ ఈ రాత్రికి చేసుకుంటాం. కానీ చిన్నగా చేసుకుంటాం. మొత్తం పూర్తయ్యాకే అసలైన పార్టీ ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.

అతడు చెప్పాడు నేను చేశా..
"చాలా రోజులుగా ఈ అవకాశాం కోసం ఎదురుచూస్తున్నాను. ఎట్టకేలకు నాకు ఈ అవకాశం దక్కింది. జట్టుకు మంచి ముగింపు ఇవ్వాలని ప్రయత్నించాను. నా బేస్ తో పాటు నేను స్వింగ్ చేసే విధానమే నా బ్యాట్ ఝళిపించడానికికి మూలం. బంతి పిచ్‌పై గ్రిప్ అవుతుండడంతో నా బ్యాటింగ్ స్టైల్ ను మార్చొద్దని, అలానే స్వింగ్ ను కొనసాగించమని చెప్పాడు. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో మా బ్యాటింగ్ యూనిట్ బాగా విఫలమైంది. అప్పుడే దినేశ్ కార్తిక్ మమ్మల్ని పిలిచి ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయించాడు. దాని ఫలితం ఈరోజు స్పష్టంగా కనిపించింది. కు స్కోరు గురించి పట్టించుకోలేదు. కేవలం ప్రతి బంతిని బలంగా బాదాలని, ఫోర్ లేదా సిక్స్ బాదాలని ఆలోచనతోనే ఉన్నాను. క్రీజులోకి నేను వస్తున్నప్పుడు టిమ్మీ రిలాక్స్ గా ఆడూ అని చెప్పాడు అదే చేశాను. నాకు రెండు పాత్రలపై ఆసక్తి ఉంది. బౌలర్ అయినా బ్యాటర్ అయినా బంతిని లేదా బ్యాటును 50-50గా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలనుకుంటాను. కానీ ఈరోజు బంతితో సరైన ప్రదర్శన చేయలేకపోయాను. బౌలింగ్‌లో ఇంకా మెరుగు పడాల్సి ఉంది. కానీ జట్టు గొప్పగా పెర్ఫామ్ చేసింది. ఎంగిడి, భువీ క్లిష్ట పరిస్థితుల్లో మమల్ని ఆదుకున్నారు." అని రొమారియో షెఫర్డ్ అన్నాడు. కాగా, ఈ మ్యాచులో అతడు 14 బంతుల్లో 4×4, 6×6 సాయంతో 53 నాటౌట్ పరుగులు చేశాడు.