Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'రోహిత్ శర్మ బ్యాటింగ్ వీడియో గేమ్‌లా ఉంటుంది'

గత కొంత కాలంగా ఫామ్ లో లేక పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్ పై రెండో వన్డే లో సెంచరీ బాది ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆడిన రంజీలోనూ విఫలమైన అతడు.. ఇంగ్లాండ్ పై 76 బంతుల్లో శతకం బాదాడు. అయితే తాజాగా రోహిత్ తిరిగి ఫామ్ లోకి రావడంపై ముంబయి రంజీ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశాడు. పరుగులు చేయలేక ఇబ్బంది పడుతోన్న సమయంలో రోహిత్ తనతో ఏం చెప్పాడో గుర్తు చేసుకున్నాడు.

అది ఏమాత్రం తగ్గలేదు..
రోహిత్ శర్మలో ఫామ్ తగ్గినప్పటికీ ఆత్మవిశ్వాసం అలానే ఉందని చెప్పాడు శార్దూల్ ఠాకూర్. "రోహిత్ శర్మ చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. అతడి వ్యక్తిత్వం, ఆటలో మాత్రమే ఛేంజ్ బాగా వచ్చింది. కానీ చిన్న చిన్న విషయాల్లో మాత్రం అతడు ఇంకా చిన్నప్పుడులానే ఉన్నాను. రీసెంట్ గా ఆస్ట్రేలియాపై సహా రంజీ మ్యాచ్ లోనూ రోహిత్ పరుగులు చేయలేకపోయాడు. అప్పుడు నేను అతడితో మాట్లాడాను. కానీ అతడు మాత్రం తన ఆత్మవిశ్వాసాన్ని వీడలేదు. 'నాకు తెలుసు పరుగులు చేయలేకపోతున్నాను. కానీ నాకు కేవలం ఒక గుడ్ ఇన్నింగ్స్ కావాలి అంతే. ఆటోమేటిక్ గా ఫామ్ లోకి వచ్చేసి పరుగులు చేసేస్తా'నని చెప్పాడు." అని శార్దూల్ ఠాకూర్ పేర్కొన్నాడు.

Rohitsharma century bats like a video game says by allrounder Shardul Thakur

ఎవరికైనా అది కష్టమే కదా..
"రోహిత్ భాయ్ ఓపెనర్. కొత్త బంతిని ఎదుర్కోవడం ఎప్పుడూ ఓ ఓపెనర్ కు కష్టమే. ఎవరైనా ఔట్ అయిపోతుంటారు. మనం అతడిని తక్కువగా అంచనా వేయకూడదు. టీమిండియాకు ఎన్నో మ్యాచుల్లో విజయాన్ని అందించాడు. సరైన సమయం వస్తే అతడు కచ్చితంగా పరుగులు చేస్తాడని, మంచి ప్రదర్శన చేస్తాడని.. ఓ ఫ్రెండ్ గా, ప్రేక్షకుడిగా నేనెప్పుడు అతడిపై నమ్మకంతోనే ఉన్నాను. అతడు ఎంతో అనుభవజ్ఞుడైన ఆటగాడు." అని ఠాకూర్ వెల్లడించాడు.

వీడియో గేమ్ లా అనిపిస్తుంది..
"నెట్స్ లేదా మైదానం అయినా.. రోహిత్ బ్యాటింగ్ తీరు చూస్తే.. అతడు ఫామ్ లో లేడని నమ్మడం చాలా కష్టం. అతడు మంచి రిథమ్, ఊపులో ఉన్నాడని అనిపిస్తుంది. అయితే ఎంత మ్యాటర్ ఉన్నా.. అదృష్టం కూడా ఉండాలి. ఎందుకంటే అతడు తన ఫేవరెట్ షాట్లు ఆడేటప్పుడు కూడా వరుసగా ఔట్ అయ్యాడు. కాబట్టి బ్యాడ్ లక్ అతడిని వెంటాడింది. అయితే రీసెంట్ గా ఇంగ్లాండ్ పై అతడు సెంచరీ బాదాడు. అందులో అలవోకగా సిక్స్ లు బాదేశాడు. అతడి క్లాస్ డిఫరెంట్ గా ఉంటుంది. అతడు సిక్స్ లు బాదే తీరు అద్భుతం. అతడు బ్యాటింగ్ చేస్తుంటే, నాకు వీడియో గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది." అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, February 14, 2025, 14:38 [IST]
Other articles published on Feb 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+