Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS BAN: 'నువ్వు నిజమైన లెజెండ్'.. బంగ్లా మ్యాచ్‌లో మనసు దోచుకున్న రోహిత్

మ్యాచ్ లో స్లెడ్జింగ్, గొడవలు, ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించడంతో పాటు క్రీడాస్ఫూర్తిని కూడా చాటుతుంటారు క్రికెటర్లు. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మరోసారి క్రీడాస్ఫూర్తి చాటుకున్నాడు. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో తన చర్యతో అభిమానుల మనసును మరోసారి గెలుచుకున్నాడు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే?

ప్రత్యర్థి బ్యాటర్ షూలేస్..
ప్రస్తుతం దుబాయ్ వేదికగా టీమిండియా - బంగ్లాదేశ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట టాస్ ఓడి బౌలింగ్ కు దిగిన టీమిండియా.. బంగ్లాదేశ్ బ్యాటర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తోంది. భారత బ్యాటర్లు వరుసగా ప్రత్యర్థి జట్లు వికెట్లు తీస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్ 10 ఓవర్లకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. క్రీజులో బ్యాటింగ్ చేస్తోన్న ప్రత్యర్థి జట్టు బ్యాటర్ జాకర్ అలీ షూ లేస్ ఊడిపోగా.. దగ్గరికి వెళ్లి దాన్ని కట్టాడు.

Rohith Sharma Sportsmanship tied shoe laces of jaker Ali in IND VS BAN match champions trophy 2025

ప్రశంసలు కురిపిస్తోన్న ఫ్యాన్స్..
ప్రస్తుతం రోహిత్ శర్మ షూ లేస్ కట్టిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు హిట్ మ్యాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రోహిత్ ది మంచి మనసు, నిజమైన లెజండ్.. అంటూ కొనియాడుతున్నారు. కాగా, రోహిత్ ఇలా మైదానంలో ఉన్నప్పుడు మరో క్రికెటర్ షూ లేస్ కట్టడం తొలిసారేం కాదు. గతంలోనూ ఇలానే చేశాడు. ఇకపోతే ఈ మ్యాచ్ లో జాకర్ అలీ హాఫ్ సెంచరీ బాదాడు. భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Story first published: Thursday, February 20, 2025, 17:16 [IST]
Other articles published on Feb 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+