రోహిత్ శర్మ శపథం - 'కచ్చితంగా దాన్ని మా వెంట తీసుకెళ్తాం'
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. అలానే యువ క్రికెటర్లకు సలహా కూడా ఇచ్చాడు. వ్యక్తిగతం కోసం కాకుండా జట్టు కోసమే తాను కోహ్లీ ఇన్నేళ్ల పాటు ఆడినట్లు తెలిపాడు.
బంగ్లాదేశ్ తో మ్యాచ్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు సిద్ధమైంది టీమిండియా. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి టోర్నీని ప్రారంభించాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే మ్యాచ్ కు ముందు ఛాంపియన్స్ ట్రోఫీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ.

కచ్చితంగా మా వెంట తీసుకెళ్తాం..
"ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలు ఎప్పుడూ ముఖ్యమే. ద్వైపాక్షిక సిరీస్ కన్నా ఇది భిన్నంగా ఉంటుంది. కొత్త కొత్త జట్లతో ఆడుతుంటాం. ఇది మనకు ఓ ఛాలెంజ్ లా ఉంటుంది. బంగ్లాదేశ్ అద్భుతమైన జట్టు. గత కొన్నేళ్లుగా మంచిగా రాణిస్తోంది. కాబట్టి వాళ్లపై గెలవడం అంత ఈజీ కాదు. మనం మన క్రికెట్ ఆడుతుండాలి. సరైన రీతిలో అద్భుతంగా ఆడుతూ ఉండాలి.
మొదటి నుంచి ఇదే చేస్తూ వస్తున్నాం. దీనిపై అవగాహన ఉండాలి. ముఖ్యమైన మ్యాచుల్లో ఎలా ఆడాలి, ఏం చేయాలనేది యువ క్రికెటర్లకు తెలిసి ఉండాలి. జట్టు కోసం ఆడాలి. నేను, కోహ్లీ జట్టు కోసం ఇలానే ఆడాం. ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించేందుకు మాకు మరొక అవకాశం దొరికింది. మేం దేని కోసమైతే (ఛాంపియన్స్ ట్రోఫీ) ఇక్కడికి వచ్చామో దానీ తీసుకునే వెళ్తాం." అని పేర్కొన్నాడు.
CAPTAIN ROHIT SHARMA IS READY FOR THE CHAMPIONS TROPHY. 🏆pic.twitter.com/7hvVgRmQQ7
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications