Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL : ప్రాక్టీస్‌లో రోహిత్ చెప్పిన మాటలతో కాన్ఫిడెన్స్ : శుభ్‌మన్ గిల్

Rohit words during practice gave Shubman Gill confidence

శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా సారధి రోహిత్ శర్మతో కలిసి యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా బరిలో దిగాడు. భారత్ ఆడిన చివరి వన్డేలో డబుల్ సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్‌ను గిల్ కోసం టీం మేనేజ్‌మెంట్ పక్కన పెట్టింది. దీనిపై పలువురు మాజీలతోపాటు అభిమానులు కూడా మండిపడ్డారు. అయితే రోహిత్ శర్మ మాత్రం తన నిర్ణయంపై బలంగా నిలబడ్డాడు. వన్డే ఫార్మాట్లో గిల్ నిలకడగా రాణిస్తున్నాడని అతనికి కచ్చితంగా అవకాశాలు ఇస్తామని తేల్చిచెప్పాడు.

కాన్ఫిడెన్స్ పెరుగుతుంది..

కాన్ఫిడెన్స్ పెరుగుతుంది..

తనపై జట్టు ఉంచిన నమ్మకాన్ని గిల్ నిరూపించుకున్నాడు. గువాహతి వేదికగా జరగిన తొలి వన్డేలో రోహిత్‌తో కలిసి జట్టుకు శుభారంభం అందించాడు. తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకంతో రాణించాడు. వీళ్లిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 143 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో కెప్టెన్ నుంచి ఇంత మంచి మద్దతు లభిస్తుంటే ఎలా ఉందని కొందరు విలేకరులు గిల్‌ను ప్రశ్నించారు. ఈ విషయంలో తను చాలా సంతోషంగా ఉన్నానని గిల్ చెప్పాడు. ఇలా మద్దతు లభిస్తే మనకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుందన్నాడు. రోహిత్‌తో కలిసి వన్డేల్లో ఓపెనింగ్ చేయడం గిల్‌కు ఇదే తొలిసారి. ఈ అనుభవం గురించి చెప్పాలన్న ప్రశ్నకు గిల్ సమాధానం ఇచ్చాడు. రోహిత్‌తో కలిసి తను గతంలో కూడా ఓపెనింగ్ చేసినట్లు చెప్పాడు.

రోహిత్‌తో ఓపెనింగ్ కొత్తేం కాదు..

రోహిత్‌తో ఓపెనింగ్ కొత్తేం కాదు..

'రోహిత్‌తో కలిసి ఆస్ట్రేలియాలో, స్వదేశంలో కూడా ఓపెనింగ్ చేశా. అయితే అది కేవలం టెస్టుల్లోనే. కాబట్టి నాకు కొత్తగా ఏం అనిపించలేదు. క్రీజులో ఉండగా ఏ బౌలర్‌ను టార్గెట్ చేయాలి? వంటి విషయాలే మాట్లాడుకుంటాం' అని వివరించాడు. అలాగే తనకు కెప్టెన్ నుంచి వస్తున్న మద్దతు గురించి కూడా వివరించాడు. 'ప్రాక్టీస్ సమయంలో కూడా రోహిత్ నాకు అదే చెప్పాడు. నేను ఓపెనింగ్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. నా సహజమైన ఆట ఆడాలని రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. వన్డేల్లో నేను ఎలా ఆడుతూ వచ్చానో అదే కొనసాగించానంతే' అని గిల్ అన్నాడు.

అదరగొట్టిన రోహిత్, కోహ్లీ..

అదరగొట్టిన రోహిత్, కోహ్లీ..

అయితే అతను 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో సెంచరీ మిస్ చేసుకున్నాడని కొందరు విమర్శించారు. దీనికి అవునని సమాధానం ఇచ్చిన గిల్.. తను అవుటైనప్పుడు ఇంకా 30 ఓవర్ల ఆట మిగిలే ఉందని, జట్టు కోసం భారీ స్కోరు చేసే అవకాశం తనకు చేజారిందని అన్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ కూడా అద్భుతంగా ఆడాడు. కేవలం 67 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. అతనైనా సెంచరీ చేస్తాడని అనుకుంటే అవకాశం మిస్ చేసుకున్నాడు. అయితే కోహ్లీ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వన్డేల్లో తన 45వ సెంచరీ నమోదు చేశాడు. దీంతో భారత జట్టు 373/7 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Story first published: Wednesday, January 11, 2023, 9:38 [IST]
Other articles published on Jan 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+