Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శివమ్ దూబెకు ధోనీలా రోహిత్ సపోర్ట్ చేయడానికి కారణమిదే - రైనా

అఫ్గానిస్థాన్ సిరీస్‌లో వరుస అర్ధశతకాలతో సత్తాచాటిన యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబెను మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కొనియాడాడు. దూబెకు మంచి పవర్ హిట్టింగ్ సామర్థ్యం ఉందని అన్నాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌లో ఎంఎస్ ధోనీ తరహాలో దూబెలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆత్మవిశ్వాసం నింపుతున్నాడని రైనా తెలిపాడు.

గాయంతో హార్దిక్ పాండ్య జట్టుకు దూరమవ్వడంతో శివమ్ దూబె అఫ్గానిస్థాన్ సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. మొహాలి వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 40 బంతుల్లో 60 పరుగులు చేశాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 9 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లోనూ అర్ధశతకంతో చెలరేగాడు. 32 బంతుల్లో 63 పరుగులు చేశాడు. మూడు ఓవర్లు వేసి 36 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీశాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ దూబె నాటౌట్‌గా నిలవడం విశేషం.

Rohit supports Shivam Dube like Dhoni. Because of this reason - Suresh Raina

''హార్దిక్ పాండ్య గాయం నుంచి కోలుకున్నా.. శివమ్ దూబె జట్టులో ఉంటాడని భావిస్తున్నా. దూబెను రోహిత్ శర్మ చక్కగా వినియోగించుకుంటున్నాడు. అయితే ఐపీఎల్ ప్రదర్శన కూడా కీలకమే. రెండు నెలల పాటు సాగే ఐపీఎల్‌లో రకరకాల పిచ్‌లపై ఉత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అక్కడ పరుగులు చేసిన ఆటగాళ్లకే అవకాశాలు దక్కతాయి. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లే జట్టులో ఉండాలని సెలక్టర్లు, కెప్టెన్ కోరుకుంటారు''

''ఇది టీమిండియా. ఇది కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉండాలని రోహిత్ కోరుకుంటాడు. దూబె గొప్ప ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్‌లోనూ అతడు సత్తాచాటాడు. తనకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చిన ధోనీ వంటి కెప్టెన్‌ను కూడా ఆకట్టుకున్నాడు.ఇప్పుడు ధోనీలానే అదే నమ్మకాన్ని దూబెకు రోహిత్ అందిస్తున్నాడు''

''దూబె భారీ షాట్లకు కారణం అతడు బ్యాట్‌ను స్వింగ్ చేయడమే. అతడు ఫుల్ డ్రైవ్ చేస్తాడు. అలా చేసినప్పుడు బ్యాట్ మిడిల్‌లో తగిలితే బాల్ గ్రౌండ్ అవతల పడుతుందని అతడికి తెలుసు. అదే రీతిలో అతడు ప్రాక్టీస్ చేశాడు. షాట్ల ఎంపికలో యశస్వీ జైశ్వాల్, శివమ్ దూబె చెక్ డ్రైవ్ కంటే ఫుల్ డ్రైవ్ పైనే నమ్మకంతో ఉంటారు'' అని రైనా అన్నాడు.

దూబె 2019లోనే భారత్ తరపున అరంగేట్రం చేసినా ఇప్పటివరకు 20 టీ20లే ఆడాడు. కరోనా లాక్‌డౌన్ తర్వాత అతడు టీమిండియా నుంచి పిలుపు కోసం మూడేళ్ల పాటు ఎదురుచూశాడు. మొత్తంగా వన్డే వరల్డ్ కప్‌ ముందు బుమ్రా సారథ్యంలో ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. కానీ ఆ తర్వాత కూడా దూబె జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు వరుస మెరుపు అర్ధశతకాలతో గట్టి పోటీనిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యకు బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపిక అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Tuesday, January 16, 2024, 12:54 [IST]
Other articles published on Jan 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+