INDvsAUS : స్మిత్ కెప్టెన్సీలో చెలరేగిన రోహిత్.. అదే సీన్ రిపీట్ చేస్తాడా?

భారత్‌తో టెస్టు సిరీస్ మూడో మ్యాచ్‌కు ముందు తల్లికి అనారోగ్యం చేయడంతో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వైస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌కు జట్టు పగ్గాలు అందించారు. అతని సారధ్యంలో మూడో టెస్టులో గెలిచిన ఆసీస్.. నాలుగో టెస్టును డ్రా చేసుకుంది. నాలుగో టెస్టు జరుగుతున్న సమయంలోనే కమిన్స్ తల్లి కన్నుమూశారు. దీంతో అతను టెస్టు సిరీస్ తర్వాత జరిగే వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.

స్మిత్ కెప్టెన్సీలో చివరి మ్యాచ్..
కమిన్స్ లేకపోవడంతో వన్డే సిరీస్‌లో కూడా స్మిత్‌కే ఆసీస్ పగ్గాలు దక్కాయి. ఈ క్రమంలో చివరగా భారత్‌లో అతను కెప్టెన్సీ వహించిన మ్యాచ్‌లో ఏమైందో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. శుక్రవారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. అయితే స్మిత్ చివరగా భారత పర్యటనలు ఆసీస్ జట్టుకు కెప్టెన్సీ వహించిన మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరిగింది. 2017లో జరిగిన ఈ సిరీస్‌లో బలమైన జట్టుతో బరిలో దిగినా కూడా ఆసీస్ కేవలం 4-1 తేడాతో ఓడిపోయింది.

చివరి మ్యాచ్‌లో ఏం జరిగింది?
నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ ఇద్దరూ చక్కగా బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత అక్షర్ పటేల్, కేదార్ జాదవ్ వరుస విరామాల్లో వికెట్లు తీశారు. అయితే ట్రావిస్ హెడ్ (42), మార్కస్ స్టొయినిస్ (46) రాణించడంతో 50 ఓవర్లలో ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. దీంతో గెలవాలంటే త్వరగా వికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ భారత ఓపెనర్లు అజింక్య రహానే, రోహిత్ శర్మ ఆ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

ఆ ఫలితం రిపీట్ అవుతుందా?
భారత ఓపెనర్లు తొలి వికెట్‌కు 124 పరుగులు జతచేశారు. రోహిత్ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయగా రహానే 61 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 39 పరుగుల మంచి కామియో ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో మనీష్ పాండే, కేదార్ జాదవ్ చక్కని ఆటతీరుతో భారత్‌కు విజయం అందించారు. అయితే ఆ వన్డే సిరీస్ ఫలితమే ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందని చెప్పలేం. దీనికి ప్రధాన కారణం చివరి రెండు టెస్టుల్లో ఆసీస్ ఆటతీరే. స్మిత్ కెప్టెన్సీలో కొత్త జట్టులా కనిపించిన ఆసీస్ అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. ఇదే జోరు కొనసాగిస్తే వన్డేల్లో కూడా భారత్‌కు గట్టిపోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications