Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Team India : ధోనీ చేసిందే చెయ్.. పాండ్యా విషయంలో రోహిత్ శర్మకు మాజీ దిగ్గజం సలహా!

Rohit Should Follow MS Dhoni in Hardik Pandya issue

ప్రస్తుతం భారత క్రీడాలోకంలో హాట్ టాపిక్‌గా మారిన పేరు హార్దిక్ పాండ్యా. వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత అతను మరో రేంజ్‌లో ఆడుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ సారధిగా తొలి సీజన్‌లోనే ఆ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ తర్వాత సీనియర్ల గైర్హాజరీలో ఐర్లాండ్, న్యూజిల్యాండ్‌తో జరిగిన టీ20 సిరీసుల్లో భారత్‌కు విజయాలు అందించాడు. తాాజాగా శ్రీలంకపై కూడా మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో తన ఖాతాలో వేసుకున్నాడు.

టీ20ల్లో కెప్టెన్ చేయాలని..

టీ20ల్లో కెప్టెన్ చేయాలని..

ఈ విజయాలన్నీ చూసిన తర్వాత చాలా మంది టీ20 ఫార్మాట్లో భారత జట్టు సారధ్య బాధ్యతలను పాండ్యాకు అప్పగించేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫామ్ లేక తంటాలు పడుతున్న రోహిత్ మిగతా ఫార్మాట్లపై ఫోకస్ పెట్టాలని, పొట్టి ఫార్మాట్‌ను పాండ్యాకు వదిలేయాలని అంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ దిగ్గజం అజయ్ జడేజా కూడా ఇదే సూచన చేశాడు. పాండ్యా తన కెప్టెన్సీలో దాదాపుగా అన్నీ మంచి నిర్ణయాలే తీసుకున్నాడని జడేజా కితాబిచ్చాడు.

పాండ్యా అన్నీ బాగానే..

పాండ్యా అన్నీ బాగానే..

'ఉమ్రాన్ మాలిక్‌ను చక్కగా ఉపయోగించుకున్నాడు. దాదాపు అన్నీ సరైన నిర్ణయాలే తీసుకున్నాడు. కాకపోతే అతనికి నేను చెప్పాలనుకునేది ఒకటే.. ఒక వారం క్రితం నువ్వు కెప్టెన్ కాదు. ఇప్పుడు కెప్టెన్‌వు. దీని వల్ల ఏం మారదు. నువ్వు ఇంతకుముందు ఎంత వేగంగా పరిగెత్తావో? ఎంత చురుకుగా ఫీల్డింగ్ చేశావో? ఇప్పుడు కూడా అదే చెయ్యాలి. ఒక ఆటగాడిగా నీ స్టాండర్ట్ కిందకు దిగకూడదు. నువ్వు జట్టును ముందుండి నడిపించడం కన్నా నువ్వు ఒక ఛాంపియన్ ప్లేయర్‌గా ఉండటమే ముఖ్యం అని చెప్తా' అని అజయ్ జడేజా వివరించాడు.

ధోనీ చేసినట్లే..

ధోనీ చేసినట్లే..

ప్రస్తుతానికైతే టీమిండియా సారధిగా రోహిత్ శర్మ ఉన్నాడని, అతని రికార్డులు కూడా బాగున్నాయని జడేజా అన్నాడు. అయితే ఎప్పుడూ కూడా ఒక కింగ్‌ వెయిటింగ్‌లో ఉండకూడదన్నాడు. 'ప్రతి కింగ్ కూడా తన అవకాశాలను ఉడుం పట్టు పట్టేయాలి. ఎందుకంటే వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఉన్న కింగ్ వచ్చి మనకు ఆ అధికారం ఇవ్వాలి. మహేంద్ర సింగ్ ధోనీ ఇదే చేశాడు. సెలెక్టర్లు, బీసీసీఐ కాదు.. తనే కోహ్లీని ఎంచుకొని తన చేతిలోని పగ్గాలు కోహ్లీకి అప్పగించాడు. ఇప్పుడు రోహిత్ కూడా అలాగే టీ20 పగ్గాలను పాండ్యాకు అప్పగిస్తే బెటర్' అని అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, January 9, 2023, 15:52 [IST]
Other articles published on Jan 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+