Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ భార్య వల్ల హార్దిక్‌‌కు కష్టాలు - భారత మాజీ క్రికెటర్

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని ఐపీఎల్ 2024 సీజన్‌కు హార్దిక్ పాండ్యకు ముంబై సారథి బాధ్యతలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రోహిత్ కెప్టెన్సీ తప్పించడానికి గల కారణాలను ఇటీవల ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ వివరించాడు.

జట్టు భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కెప్టెన్‌ను మార్చామని, ఇదంతా క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయమేనని, వ్యక్తిగత నిర్ణయాలు కాదని చెప్పాడు. ఈ విషయాన్ని భావోద్వేగంతో చూడకూడదని అన్నాడు.అయితే ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ భార్య రితికా సజ్‌దేహ్‌ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. 'ఈ నిర్ణయంలో చాలా తప్పులున్నాయి' అంటూ రితికా పేర్కొంది.

Rohit Sharmas wife Ritika Sajdeh comments add biggest pressure on Hardik Pandya - Aakash Chopra

తాజాగా దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. రితికా వ్యాఖ్యలు ఎప్పటికీ దావానలంలా వ్యాపిస్తూనే ఉంటుందని అన్నాడు. అంతేగాక ఈ విషయం హార్దిక్ పాండ్యను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందని పేర్కొన్నాడు. ''బౌచర్ ఇంటర్వ్యూ చూశాను. కెప్టెన్సీని ఎందుకు మార్చారని వివరించాడు. క్రికెట్‌కు సంబంధించిన కారణాలను వివరించడానికి అతడు ప్రయత్నించాడు. కానీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఇంటర్వ్యూపై రోహిత్ భార్య రితికా కామెంట్ చేశారు. 'ఈ నిర్ణయంలో చాలా తప్పులున్నాయి' అని ఆమె చెప్పిన కామెంట్ వైరల్ అవుతూనే ఉంటుంది''

''ఏది ఒప్పు, ఏది తప్పు అని మనకు తెలియదు. కానీ ఈ విషయంలో కాస్త ఆందోళన చెందుతున్నా. పేపర్‌పై ముంబై ఇండియన్స్ శక్తివంతమైన జట్టు. కానీ హార్దిక్ పాండ్యను ఇది తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. హార్దిక్ తన వేళ్లను పిడికిలిగా మార్చగలడా? జట్టు మొత్తాన్ని ఒకే మార్గంలో నడిపించగలడా? చూడాలి'' అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. గుజరాత్ టైటాన్స్ గత రెండు సీజన్లలో ఫైనల్స్‌కు చేరిన హార్దిక్ పాండ్య ట్రేడింగ్‌లో తిరిగి ముంబై గూటికి చేరిన విషయం తెలిసిందే. 2022 సీజన్‌లో గుజరాత్‌ను హార్దిక్ విజేతగా కూడా నిలిపాడు.

Rohit Sharmas wife Ritika Sajdeh comments add biggest pressure on Hardik Pandya - Aakash Chopra

ముంబై ఇండియన్స్:
హార్దిక్ పాండ్యా(కెప్టెన్), (ట్రేడింగ్), గెరాల్డ్ కోయిట్జీ, దిల్షాన్ మధుషంక, శ్రేయస్ గోపాల్, నువాన్ తుషార్, నమాన్ ధిర్, అన్షుల్ కంబోజ్, మహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ, రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రేవిస్,సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, శామ్స్ ములాని, నేహాల్ వధేరా, జస్‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తీకేయ, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జాసన్ బెహ్రెండార్ఫ్, రోమారియో షెఫర్డ్(ట్రేడింగ్)

Story first published: Thursday, February 8, 2024, 13:06 [IST]
Other articles published on Feb 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+