ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేతో టీమిండియా ఫామ్ లోకి వచ్చేశాడు. పేలవ ఫామ్ అంటూ విమర్శలు, రిటైర్మైంట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తోన్న వేళ.. బ్యాట్ తో సెంచరీ సమాధానం చెప్పాడు. పైగా శతకానికి మరో నాలుగు పరుగులు అవసరమైన నేపథ్యంలో ఏకంగా సిక్స్ బాది గ్రౌండ్ షేక్ చేశాడు హిట్ మ్యాన్. దీంతో రోహిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ పలు రికార్డులను కూడా నమోదు చేశాడు.
తాజా ప్రదర్శనతో రోహిత్ సాధించిన రికార్డులివే...
30 ఏళ్ల వయసు దాటిన ఆటగాళ్లలో.. అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు (36) చేసిన భారత క్రికెటర్ గా నిలిచాడు రోహిత్ శర్మ. సచిన్ 35 శతకాలు బాదాడు.

భారత ఓపెనర్లలో అత్యధిక (121) 50 ప్లస్ స్కోర్లు చేసిన ఓపెనర్ గా నిలిచాడు రోహిత్. అంతకుముందు సచిన్. 120 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు.
టీమిండియా ఓపెనర్‌గా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ సాధించిన అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్ శర్మ. అన్నీ ఫార్మాట్లలో కలిపి భారత్ తరఫున ఓపెనర్ గా సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు రోహిత్. ఇప్పటి వరకు అతడు 15,404 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్ 15,335 రన్స్ చేయగా.. వీరెంద్ర సెహ్వాగ్ 15,758 రన్స్ చేశాడు.
ఇంగ్లాండ్ పై సూపర్ ఫాస్ట్ గా సెంచరీ బాదిన భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 76 బంతుల్లో హిట్ మ్యాన్ శతకం బాదాడు.
రోహిత్ శర్మ - శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్వదేశంలో ఇంగ్లాండ్ పై ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం.
50 వన్డేల్లో సారథిగా వ్యవహరించాడు రోహిత్ శర్మ. అలానే అత్యధిక విజయాలు సాధించిన ఆరో సారథిగా నిలిచాడు. భారత్ తరఫున రెండో కెప్టెన్ గా ఘనత అందుకున్నాడు. మొత్తం 36 మ్యాచుల్లో జట్టుకు విజయాల్ని అందించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (39) అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ సిరీస్ విజయంతో.. ఇంగ్లాండ్ పై వరుసగా ఏడో ద్వైపాక్షిక సిరీస్‌ను భారత జట్టు దక్కించుకుంది.