Rohit Sharma: రోహిత్ రిటైర్ అవుతాడు కానీ.. కోహ్లీ మాత్రం మరో ప్రపంచకప్ ఆడతాడు.. అంతేనా?

టీ20 ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన టీమిండియా.. అందరికీ షాకిస్తూ ఇంటి దారి పట్టింది. గ్రూప్ దశలో అద్భుతమైన పోరాటపటిమ చూపించిన భారత జట్టు.. కీలకమైన నాకౌట్ దశకు వచ్చేసరికి చేతులెత్తేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో బ్యాటర్లుకానీ, బౌలర్లు కానీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీనిపై చాలా మంది మాజీలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మోంటీ పనేసర్ కూడా స్పందించాడు.

సెమీస్‌లో పోరాటమే లేదు
భారత జట్టు సెమీఫైనల్‌లో అసలు పోరాటమే చూపలేదని పనేసర్ అన్నాడు. అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ ఇద్దరి ముందు భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదని అభిప్రాయపడ్డాడు. '168 తక్కువ స్కోరు కాదు. కానీ భారత బౌలర్లు అసలు క్లూలెస్‌గా కనిపించారు. సెమీస్ ఆడుతూ ఏమాత్రం పోరాటం చూపకపోవడం షాకింగ్ విషయం. ఆ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది' అని తేల్చిచెప్పాడు పనేసర్.

రోహిత్ ఉండడు..
సాధారణంగా వరల్డ్ కప్ నుంచి పెద్ద జట్లు నిష్క్రమించినప్పుడు.. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అవడం మామూలే. కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడానికి పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి, వన్డే-టెస్టు ఫార్మాట్‌లపై ఫోకస్ పెడుతుంటారు. ఇదే విషయాన్ని చెప్పిన పనేసర్.. భారత జట్టులో రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, దినేష్ కార్తీక్ ముగ్గురూ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందన్నాడు. 'వచ్చే ప్రపంచకప్ నాటికి రోహిత్ వయసు 37 అవుతుంది. ఆ వయసులో అతను ప్రపంచకప్ ఆడతాడని నేను అనుకోవడం లేదు' అని చెప్పాడు.

కోహ్లీకి వయసు నెంబర్ అంతే
అదే సమయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం వచ్చే ప్రపంచకప్ కూడా ఆడే అవకాశం ఉందని పనేసర్ అంటున్నాడు. 34 ఏళ్ల కోహ్లీ భారత జట్టులో అందరి కన్నా ఫిట్‌గా ఉన్న ఆటగాడని, అతనికి వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని అభిప్రాయపడ్డాడు. కాబట్టి కోహ్లీ వచ్చే టీ20 ప్రపంచకప్ కూడా ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నాడు. ఈ ఏడాది కూడా కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications