
ఐపీఎల్-2022లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 165పరుగులు చేసింది. 166పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ వివాదాస్పదరీతిలో ఔటయిపోయాడు. ఈ అవుట్ పట్ల నెట్టింటా డిబేట్లు మొదలయ్యాయి. థర్డ్ అంపైర్ కు ఏమన్న బుద్ధి ఉందా.. టెక్నాలజీ ఏదీ చెబితే అదే నమ్మడమేనా.. క్లియర్‌గా బంతి బ్యాట్‌ను తాకనట్టు కన్పిస్తున్నా ఔటిచ్చేయడమేనా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
తొలి ఓవర్ బౌలింగ్ వేసిన సౌథీ బౌలింగ్లో రోహిత్ శర్మ కీపర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. తొలి ఓవర్ సౌథీ బౌలింగ్ వేయగా.. ఆ ఓవర్ చివరి బంతిని ఎదుర్కొన్న రోహిత్ శర్మ.. లెగ్ సైడ్ క్లిక్ చేయాలని చూశాడు. కానీ బంతి బ్యాట్‌కు తాకిందో తాకలేదో కానీ ప్యాడ్‌కు తాకి కీపర్ షెల్డన్ జాక్సన్ వైపు వెళ్లగా..అతను అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. ఔట్ అంటూ జాక్సన్ అప్పీలు చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో జాక్సన్ రివ్యూ తీసుకోవాలంటూ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్‌కు సూచించాడు. శ్రేయస్ రివ్యూ తీసుకున్నాడు. దీంతో థర్డ్ అంపైర్ అల్ట్రా ఎడ్జ్‌కు వెళ్లాడు. అల్ట్రా ఎడ్జ్‌లో బంతి రోహిత్ బ్యాట్‌కు ఏమాత్రం టచ్ అయినట్లు కన్పించలేదు. కానీ స్పైక్స్ మాత్రం వచ్చాయి. దీంతో థర్డ్ అంపైర్ అవుటని ప్రకటించాడు.
ఈ నిర్ణయంతో ఒక్కసారి తెల్లమొహం వేసిన రోహిత్ పూర్తి అసహనం వ్యక్తం చేశాడు. బంతి క్లియర్‌గా బ్యాట్‌కు రీచ్ అవుతున్నప్పుడే స్పైక్స్ వచ్చాయి. ఇది వైడ్ యాంగిల్స్‌లో చూసినప్పుడు బ్యాట్‌కు బంతి దూరంగా కన్పించింది. అలాగే జాక్సన్ కూడా సరిగా క్యాచ్ అందుకున్నాడో లేదో అన్న విషయంలోనూ డౌట్స్ ఉన్నాయి. ఈ విషయమై ట్విట్టరులో నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. అయితే కొందరు మాత్రం అంపైర్ సరైన నిర్ణయమే ఇచ్చాడంటూ పేర్కొంటున్నారు. ఇంతకు ఇది ఔటా కాదా అనేది మాత్రం మిస్టరీగానే మిగిలింది.