T20 World Cup 2022: మళ్లీ నిరాశ పరిచిన హిచ్ మ్యాన్.. 15 పరుగులకే ఔట్..

సిడ్నీలో జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ నిరాశపరిచాడు. 13 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. ముజారబానీ బౌలింగ్ లో షాట్ కు యత్నంచి మసకద్జాకు చిక్కాడు. మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా నిరాశ పరిచాడు రోహిత్ శర్మ. 8 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేశాడు.

హాఫ్ సెంచరీ
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 7 బంతుల్లో 4 పరుగులకే చేశాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 39 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 15 పరుగులే చేశాడు. కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది.

రిషబ్ పంత్
ఈ మ్యాచ్ లో భారత్ ఒక్క మార్పు తో బరిలోకి దిగింది. దినేక్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ ను తీసుకున్నారు. అయితే గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ కు వెళ్లాయి. నెదర్లాండ్స్ పై సౌతాఫ్రికా ఓడిపోవడంతో ఇండియా సెమీస్ కు వెళ్లడం పక్కా కాగా.. బంగ్లాదేశ్ పై గెలిచిన పాక్ సెమీస్ కు దూసుకెళ్లింది.

భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, హర్ష్ దీప్ సింగ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications