న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స‌చిన్ ఆల్‌టైమ్ రికార్డ్‌కు ముప్పు: ప‌్ర‌పంచ‌క‌ప్ టాప్ స్కోర‌ర్ రేసులో ఆ ఇద్ద‌రూ!

Rohit Sharma vs David Warner in race for top run-scorer

లండ‌న్‌: భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కేప్టెన్‌, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ నెల‌కొల్పిన మ‌రో రికార్డు ప్ర‌మాదంలో ప‌డింది. ఇంకొక్క మ్యాచ్ చాలు- స‌చిన్ నెల‌కొల్పిన ఆల్‌టైమ్ రికార్డు బ‌ద్ద‌లు కావ‌డానికి! దీనికి ఇద్ద‌రు డాషింగ్ బ్యాట్స్‌మెన్ల రూపంలో ముప్పు పొంచివుంది. వారిద్ద‌రూ ఓపెన‌ర్లే కావ‌డం, త‌మ జ‌ట్లు భారీ స్కోరు సాధించ‌డానికి బాట‌లు వేసిన వారే కావ‌డం విశేషం. ఆ ఇద్ద‌రే- టీమిండియా, ఆస్ట్రేలియా ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, డేవిడ్ వార్న‌ర్‌. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రూ ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో ఉన్నారు.

647 ప‌రుగుల‌తో రోహిత్ శ‌ర్మ‌

647 ప‌రుగుల‌తో రోహిత్ శ‌ర్మ‌

ఈ ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో లీగ్ ద‌శ ముగిసే స‌రికి రోహిత్ శ‌ర్మ చేసిన ప‌రుగుల సంఖ్య 647. ఇదో రికార్డు. లీగ్ ద‌శ‌లోనే ఇన్ని ప‌రుగులు చేసిన మ‌రో బ్యాట్స్‌మెన్ చ‌రిత్ర‌లోనే లేడు. ఈ ఒక్క టోర్న‌మెంట్‌లోనే అయిదు సెంచ‌రీలు సాధించిన మొన‌గాడిగా నిల్చున్నాడ‌త‌ను. ద‌క్షిణాఫ్రికాపై 122, ఆస్ట్రేలియా-57, పాకిస్తాన్‌-140, ఆఫ్ఘ‌నిస్తాన్‌-1, వెస్టిండీస్‌-18, ఇంగ్లండ్‌-102, బంగ్లాదేశ్‌-104, శ్రీలంక‌-103 ప‌రుగులు చేశాడు రోహిత్ శ‌ర్మ‌. ఫైన‌ల్ సంగ‌తి అటుంచితే- సెమీస్ ఇంకా ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ క‌నీసం 26 ప‌రుగులు చేసినా చాలు! స‌చిన్ రికార్డు తెర‌మ‌రుగైపోతుంది.

రోహిత్‌ను త‌రుముకొస్తున్న వార్న‌ర్‌..

రోహిత్‌ను త‌రుముకొస్తున్న వార్న‌ర్‌..

రోహిత్ శ‌ర్మ త‌ర‌హాలోనే ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో బ్యాటింగ్‌తో అద‌ర‌గొడుతున్న మ‌రో ఓపెన‌ర్ డేవిడ్ వార్నర్‌. ప్ర‌స్తుతం వార్న‌ర్ 638 ప‌రుగుల‌తో అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రికెట‌ర్ల జాబితాలో రెండోస్థానంలో కొన‌సాగుతున్నాడు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న ప‌రుగుల అంత‌రం ప్ర‌స్తుతానికి ఏడే. వార్న‌ర్ కూడా ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. రెండో సెమీఫైన‌ల్‌లో భాగంగా ఆస్ట్రేలియా శుక్ర‌వారం ఇంగ్లండ్‌ను ఢీ కొట్ట‌బోతోంది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్న‌ర్ య‌థాత‌థంగా రాణించ‌గ‌లిగితే- అటు స‌చిన్ రికార్డు ఉండ‌దు.. ఇటు రోహిత్ శ‌ర్మ చేసిన అత్య‌ధిక ప‌రుగుల సంఖ్య కూడా గ‌ల్లంత‌య్యే ప్ర‌మాదం ఉంది.

659 ప‌రుగుల‌తో హెడెన్‌

659 ప‌రుగుల‌తో హెడెన్‌

ఆస్ట్రేలియాకే చెందిన మాజీ ఓపెన‌ర్ మాథ్యూ హెడెన్ పేరు మీద కూడా అత్య‌ధిక ప‌రుగులు సాధించిన రికార్డు ఉంది. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో 659 ప‌రుగులు చేశాడు హెడెన్‌. 2003 ప్ర‌పంచ‌క‌ప్‌లో టెండుల్క‌ర్ దీన్ని అధిగ‌మించాడు. 673 ప‌రుగుల‌తో కొత్త రికార్డును నెల‌కొల్పాడు. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ‌, డేవిడ్ వార్న‌ర్‌ల ధాటికి ఈ రెండూ క‌నుమ‌రుగు కావ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. బంగ్లాదేశ్ ఓపెన‌ర్ ష‌కీబుల్ హ‌స‌న్ అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రికెట‌ర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్న‌మెంట్‌లో మొత్తం క‌లిపి 606 ప‌రుగులు చేశాడ‌త‌ను. ష‌కీబుల్ హ‌స‌న్ కూడా ఓపెన‌రే కావ‌డం ఇంకో విశేషం.

Story first published: Monday, July 8, 2019, 14:32 [IST]
Other articles published on Jul 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X