For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli Bowling Today: కోహ్లీ,సూర్య కూడా సిద్ధంగా ఉన్నారు..నేనే బౌలింగ్ చేస్తా రోహిత్!

Rohit Sharma, Virat kohli And Suryakumar Ready To Become 6th Bowling Option For India T20 World Cup
T20 World Cup, IND vs AUS Warm Up : Rohit, Kohli, Surya - 6th Bowling Option || Oneindia Telugu

దుబాయ్: తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో పటిష్ట ఇంగ్లండ్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌ 2021లో సన్నాహాన్ని ఘనంగా ఆరంభించిన టీమిండియా మరో ప్రాక్టీస్‌ మ్యాచుకు సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో రెండో సన్నాహక మ్యాచులో మరో పటిష్ట జట్టు ఆస్ట్రేలియాను కోహ్లీ ఢీ కొంటుంది. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. జోష హెజెల్ వుడ్, మిచెల్ మిచెల్ స్వెప్సన్, జోష్ ఇంగ్లీస్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఆసీస్ స్టార్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్ ఆడుతున్నారు.

ఈ మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. దాంతో మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో తాత్కలిక కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు. టాస్ వేసాక రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'టాస్ గెలిస్తే మేము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. స్కోర్ బోర్డు మీద ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాం. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలు ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఆరో బౌలింగ్ ఆప్షన్‌తో పాటు బ్యాటింగ్ కాంబినేషన్‌ను కూడా ఈ మ్యాచ్‌తో సెట్ చేయాలనుకుంటున్నాము. ఈరోజు మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడం లేదు. బౌలింగ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. టోర్నమెంట్ ప్రారంభానికి అతను సిద్ధంగా ఉండాలి' అని అన్నాడు.

'భారత జట్టులో నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. అయినా ఆరో బౌలింగ్ ఆప్షన్ ఎంతో అవసరం. ఆరో బౌలర్ అవసరం అనుకుంటే నేనే బౌలింగ్ చేస్తా (నవ్వుతూ). విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు' అని స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ వంటి పేస్ బౌలర్లు.. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ చహర్, వరుణ్ చక్రవర్తీ వంటి స్పిన్నర్లు టీమిండియాలో ఉన్నారు. యూఏఈ పిచులు స్పిన్ బౌలింగ్‌కి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. రోహిత్, కోహ్లీ లాంటీ పార్ట్ టైం స్పిన్నర్లు కూడా ఇక్కడ జట్టుకు ఉపయోగపడనున్నారు.

తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ చహర్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తీ.

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్.

Story first published: Wednesday, October 20, 2021, 17:08 [IST]
Other articles published on Oct 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+