Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్ ఎవడైతే ఏంది భాయ్.. దిగిండంటే సీన్ సీతారామాయణమే!

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం జట్టుకు కెప్టెన్ కాకపోవచ్చు, కనీసం వైస్ కెప్టెన్ కాకపోవచ్చు.. కానీ జట్టుకు హిట్ మ్యాన్ ఇప్పటికీ ఓ తిరుగులేని నాయకుడే. ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ గాయం కారణంగా తుది జట్టులో లేడు, కనీసం ఇంపాక్ట్ ప్లేయర్‌గా కూడా పేరు నమోదు చేసుకోలేదు. అయితే మైదానంలో లేకపోయినా జట్టు గెలుపు కోసం రోహిత్ శర్మ పడ్డ తపన ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

సూర్యకు రోహిత్ వ్యూహాలు
గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఒకానొక దశలో మ్యాచ్ బ్రేక్ సమయంలో రోహిత శర్మ మైదానంలోకి వచ్చాడు. ఆ సమయంలో ముంబై వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఫీల్డింగ్ సెట్ చేయడం, బౌలింగ్ వ్యూహలపై రోహిత్ శర్మ సుదీర్ఘంగా చర్చించాడు. జట్టులో ఆటగాడిగా లేకపోయినా.. తన అనుభవాన్నంతా ఉపయోగించి సూర్యకుమార్ యాదవ్‌కు టిప్స్ ఇవ్వడం చూసిన అభిమానులు కెప్టెన్ అంటే రోహితే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రోహిత్ శర్మ చూపించిన ఈ కెప్టెన్సీ మూమెంట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

Rohit Sharma Viral Captaincy Moment vs Gujarat Titans Hitman Guides Surya Despite Being Out of Squad

పాండ్యా క్లాస్.. తిలక్ వర్మ విధ్వంసం
ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ చరిత్రలో నిలిచిపోయే విజయాల్లో ఒకటిగా మారింది. ముఖ్యంగా యువ బ్యాటర్ తిలక్ వర్మ(101*) తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి ముంబై జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ సెంచరీ వెనుక కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన ఓ చిన్న హెచ్చరిక ఉంది. మొదట 22 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడుతున్న తిలక్ వద్దకు స్ట్రాటజిక్ బ్రేక్ సమయంలో వెళ్లిన హర్దిక్ పాండ్యా.. ఇన్నింగ్స్ వేగాన్ని పెంచాలని చాలా సీరియస్‌గా చెప్పాడు. పాండ్యా మాటలతో ఒక్కసారిగా గేర్ మార్చిన తిలక్.. తర్వాతి 23 బంతుల్లోనే 82 పరుగులు పిండుకుని 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.

మెరిసిన బుమ్రా.. కుప్పకూలిన గుజరాత్
ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. గత 5 మ్యాచ్‌లుగా వికెట్ లేక ఇబ్బంది పడుతున్న జస్ప్రీత్ బుమ్రా.. ఇన్నింగ్స్ మొదటి బంతికే సాయి సుదర్శన్‌ను ఔట్ చేసి ముంబైకి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత గుజరాత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ కేవలం 100 పరుగులకే కుప్పకూలింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ వరుసగా ఉన్న 4 పరాజయాల పరంపరకు ముగింపు పలికింది.

ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ జట్టు సభ్యులతో కలిసి వ్యూహాలు పంచుకోవడం ముంబై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. "కెప్టెన్ బ్యాండ్ ఉన్నా లేకపోయినా రోహిత్ నాయకత్వ లక్షణాలు ఎక్కడికీ పోవు" అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. జట్టు సంక్షోభంలో ఉన్నప్పుడు తన బాధ్యతను గుర్తించి సలహాలు ఇవ్వడం రోహిత్ గొప్పతనానికి నిదర్శనమని క్రికెట్ విశ్లేషకులు కూడా ప్రశంసిస్తున్నారు. ఈ అద్భుత విజయం ముంబై ఇండియన్స్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Story first published: Tuesday, April 21, 2026, 11:52 [IST]
Other articles published on Apr 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+