కుడి తొడకు ఆపరేషన్: ఆ తర్వాత రోహిత్ శర్మ ఇలా
లండన్: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ కుడి తొడకు నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైంది. లండన్‌లో నిపుణులైన వైద్యుల సమక్షంలో ఆపరేషన్ విజయవంతంగా జరిగినట్లు అతను కోలుకుంటున్నాడని బీసీసీఐ మెడికల్ టీమ్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
'బీసీసీఐ మెడికల్ టీమ్ రోహిత్ శర్మ చికిత్సను పర్యవేక్షిస్తోంది. మరో 24 గంటల్లో అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతాడు' అని బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. తన ఆపరేషన్‌కు సంబంధించిన ఫొటోను అభిమానుల కోసం రోహిత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

'అంతా సవ్యంగా జరిగింది. మీ మద్దతుకు ధన్యవాదాలు. సాధ్యమైనంత తొందరగా కోలుకొని మళ్లీ మైదానంలో అడుగుపెట్టాలని ఉత్సుకతతో ఉన్నాను' అని రోహిత్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. రోహిత్ శర్మ మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముంది.
అయితే తిరిగి బ్యాట్ పట్టుకునేందుకు మాత్రం కనీసం 10 నుంచి 12 వారాల సమయం పడుతుంది. న్యూజిలాండ్‌తో విశాఖపట్నంలో జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు దూరమైన రోహిత్ సర్జరీ కారణంగా 10 నుంచి 12 వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications