For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హ్యాపీ బ‌ర్త్‌డే రోహిత్ శర్మ.. ప్రపంచకప్‌లో 5 సెంచరీలు.. వన్డేల్లో 3 ద్విశతకాలు!!

Rohit Sharma turns 33: On Hitman’s birthday re-live his three double hundreds in ODIs
#HappyBirthdayRohitSharma : On Hitman’s Birthday, Re-live His 3 Double Centuries In ODIs

హైదరాబాద్: అద్భుత బ్యాటింగ్‌తో అభిమానుల‌ను ఆనందింపజేస్తున్న టీమిండియా స్టార్ ఓపెన‌ర్ 'హిట్‌మ్యాన్' రోహిత్ శ‌ర్మ ఈ రోజు (గురువారం) 33వ ప‌డిలో అడుగుపెట్టాడు. లాక్‌డౌన్ కారణంగా రోహిత్‌ ఈ సారి పుట్టిన రోజు వేడుక‌ల‌ను కుటుంబ స‌భ్యుల‌తో క‌లిపి జ‌రుపుకుంటున్న‌ట్లు తెలిపాడు. క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ నేప‌థ్యంలో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2020 సీజ‌న్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ‌టంతో ఇంట్లోనే ప‌రిమిత‌మైన రోహిత్‌కు స‌హ‌చ‌రులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ధోనీ ప్రయోగం:

ధోనీ ప్రయోగం:

2007లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ కెరీర్ ఆరంభంలో చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఒకానొక దశలో రోహిత్ కెరీర్ ముగిసిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అతడ్ని ప్రయోగాత్మకంగా ఓపెనర్‌గా పంపి క్రికెట్ ప్రపంచానికి కొత్త 'హిట్‌మ్యాన్'‌ని పరిచయం చేశాడు. అప్పటి నుండి రోహిత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. పరుగుల వరద పారిస్తూ.. టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్నాడు.

 వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు:

వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు:

2007లో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం ఆరేళ్లు సమయం పట్టింది. కెరీర్ ఆరంభంలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన హిట్‌మ్యాన్ ఆశించిన మేర రాణించలేకపోయాడు. కానీ ఓపెనర్‌గా మారిన తర్వాత తనలోని సిసలైన ఆటని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు, టీ20ల్లోనూ నాలుగు సెంచరీలు చేసి రోహిత్ కెరీర్ బెస్ట్ ప్రదర్శనని ఇచ్చాడు. టెస్టుల్లోనూ అరంగేట్రం చేసిన సిరీస్‌లోనే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదాడు. ఇక వన్డేల్లోనూ డబుల్ సెంచరీని సిక్స్‌తో సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌ రోహిత్.

 గతేడాదంతా 'హిట్‌మ్యాన్‌' హిట్టే:

గతేడాదంతా 'హిట్‌మ్యాన్‌' హిట్టే:

2019లో రోహిత్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. కూతురు 'సమైరా' పుట్టిన శుభవేళ ఏడాదంతా 'హిట్‌మ్యాన్‌' హిట్టే అయ్యాడు. ఐపీఎల్‌-12లో 14 మ్యాచ్‌ల్లో 405 పరుగులు చేశాడు. అంతేకాదు అద్భుత నాయకత్వంతో ముంబై ఇండియన్స్‌ జట్టును ముందుండి నడిపించాడు. ముంబై సమిష్టి ప్రదర్శనతో ఫైనల్ చేరింది. 2018లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మూడోసారి ఆ కప్పు గెలిచి జోరుమీదున్నాడు. అందరూ చెన్నై గెలుస్తుందనే భావనలో ఉన్నారు. అయితే ఉత్కంఠ పోరులో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముంబైని విజేతగా నిలిపాడు. దీంతో ఎక్కువ సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా ముంబై చరిత్ర సృష్టించింది.

ఐదు శతకాలతో చరిత్ర:

ఐదు శతకాలతో చరిత్ర:

ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ ప్రభంజనమే సృష్టించాడు. ఐదు శతకాలతో చెలరేగాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రల్లోకెక్కాడు. ప్రపంచకప్‌లో నాలుగు అత్యధిక శతకాలు చేసిన లంక మాజీ ఆటగాడు కుమార సంగక్కరను అధిగమించాడు. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లపై శతకాలు చేసాడు. అయితే కీలక సెమీస్ మ్యాచులో మాత్రం విఫలమయ్యాడు.

జయసూర్య రికార్డు బద్దలు:

జయసూర్య రికార్డు బద్దలు:

గతేడాది రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఓపెనర్‌గా ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును రోహిత్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 22 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న శ్రీలంక మాజీ ఓపెనర్‌ సనత్‌ జయసూర్య రికార్డును బద్దలు కొట్టాడు. 1997లో జయసూర్య అన్ని ఫార్మాట్లలో కలిపి ఆ క్యాలెండర్‌ ఇయర్‌లో 2,387 పరుగులు చేసాడు.

బ్రాండ్‌లోనూ టాపే:

బ్రాండ్‌లోనూ టాపే:

ప్రపంచకప్‌లో ఐదు శతకాలతో చెలరేగడంతో రోహిత్ శర్మ బ్రాండ్‌ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. రోహిత్‌ ప్రస్తుతం దాదాపు 20కి పైగా వ్యాపార ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. ఏడాదికి సుమారు రూ.75 కోట్లకు పైనే సంపాదిస్తాడట. పలు బ్రాండ్‌ వస్తువులకు యాడ్‌ షూటింగ్‌లో పాల్గొనాలంటే రోజుకు కనీసం రూ.ఒక కోటి తీసుకుంటాడని సమాచారం తెలుస్తోంది.

Story first published: Tuesday, July 7, 2020, 15:25 [IST]
Other articles published on Jul 7, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+