For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India T20I Captain: టీ20ల్లో కొత్త కెప్టెన్‌ అతడే?.. ప్రపంచకప్ తర్వాత అఫీషియల్ అనౌన్స్‌మెంట్!!

Rohit Sharma to take over Team India’s T20I captaincy from Virat Kohli after T20 World Cup?
Team India కెప్టెన్ గా సరైనోడు..! || Oneindia Telugu

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ.. టీమిండియా కెప్టెన్‌గా కూడా తప్పుకోనున్నాడు. దాంతో కోహ్లీ స్థానాన్ని ఎవరి భర్తీ చేస్తారన్న చర్చ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అయింది. కొంతమంది ఓపెనర్ రోహిత్ శర్మ అంటుంటే.. మరికొందరు లోకేష్ రాహుల్ అంటున్నారు. ఇంకొందరు మాత్రం రిషబ్ పంత్ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రోహిత్ శర్మకు భారత జట్టు పగ్గాలు ఇవ్వనున్నారని ఆ వార్తా సారంశం.

టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు టీ20ల్లో కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు ఓ జాతీయ స్పోర్ట్స్ వెబ్‌‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ‌లో వెల్లడించారు. 'ఇందులో దాచానికి ఏం లేదు. భారత జట్టు పగ్గాలు అందుకునే రేసులో రోహిత్ శర్మ ఖచ్చితంగా ముందుంటాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు. ప్రపంచకప్ అనంతరం అధికారిక ప్రకటన ఉంటుంది' అని ఆ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న రోహిత్ ఫాన్స్ ఆనందంలో తెలియాడుతున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో రోహిత్ శర్మకు కెప్టెన్‌గా గొప్ప రికార్డు ఉన్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ జట్టుకు సారధ్యం వహిస్తున్న రోహిత్.. ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ లీగ్ టీ20లో కూడా రెండు సార్లు ట్రోఫీ ముంబైకి కప్ అందించాడు. ఐపీఎల్ టోర్నీలో అత్యధిక ట్రోఫీలు అందించిన అందించిన కెప్టెన్ రోహిత్ మాత్రమే. మరోవైపు విరాట్ కోహ్లీ తన జట్టు బెంగళూరుకు ఒక్క టైటిల్ కూడా అందించలేకపోయాడు. ఇక కోహ్లీ టీమిండియా తరపున టెస్టులు, వన్డేలకు సారధిగా వ్యవహరించనున్నాడు.

మరోవైపు ఆర్‌సీబీ టీమ్‌మేనేజ్‌మెంట్ కూడా అసలు సిసలు కెప్టెన్ కోసం ఇప్పుటి నుంచి ప్రణాళికలు రచించనుంది. విరాట్ కోహ్లీ వారుసుడిగా ఆర్‌సీబీ కెప్టెన్ రేసులో ఓ నలుగురు ప్లేయర్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏబీ డివిలియర్స్ వచ్చే సీజన్‌లో కూడా ఆడితే అతనికే ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలు దక్కనున్నాయి. గత కొన్నేళ్లుగా జట్టుతో ఉన్న అతనికి టీమ్‌మేనేజ్‌మెంట్‌తో మంచి సంబంధాలున్నాయి. ఆర్‌సీబీ టీమ్‌లో ఉన్న గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు సారథ్య బాధ్యతలు ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సీజన్ వేలంతోనే ఆర్‌సీబీలోకి అడుగుపెట్టిన మ్యాక్సీ.. దుమ్మురేపాడు. డేవిడ్ వార్నర్, సూర్యకుమార్ యాదవ్‌, సురేష్ రైనా, ఫాఫ్ డుప్లెసిస్ పేర్లు కూడా వినిపిసున్నాయి.

Story first published: Wednesday, October 20, 2021, 23:21 [IST]
Other articles published on Oct 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+