ఫైనల్ తర్వాత ఆటమ్ బాంబ్ పేల్చనున్న రోహిత్ శర్మ - వన్డేలకు గుడ్ బై!!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ డెసిషన్ ప్రకటించనున్నాడని తెలిసింది. అతడు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సమాచారం అందింది. అసలే గత కొంత కాలంగా రోహిత్ వన్డేల్లో పరుగులు చేయలేక ఇబ్బంది పడుతోన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అతడు భారీ పరగులు చేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. కానీ వర్కౌట్ అవ్వట్లేదు. వయసు 38 వచ్చేసింది. అతడి ఫిజికల్ ఫిట్ నెస్ కూడా సహకరించట్లేదు.
A tale of many firsts 🙌🙌@ImRo45 becomes the first Captain to lead his team to the final of all four major ICC men's tournaments.#TeamIndia pic.twitter.com/FXzPwNO3Xu
— BCCI (@BCCI) March 6, 2025
అందుకే ఇప్పుడు రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఫైనల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఘనంగా తన నిర్ణయాన్ని ప్రకటించాలని ఫిక్స్ అయ్యాడట. అయితే టెస్టుల్లో మాత్రం మరో ఏడాది పాటు కొనసాగుతాడని తెలిసింది. అలానే ఐపీఎల్ లో కూడా ఇంకొన్నేళ్ల పాటు కొనసాగుతాడని సమాచారం అందింది. ఏదేమైనా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచిన, ఓడినా తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని రోహిత్ ప్రకటిస్తాడని ఇంగ్లీష్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.

టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలానే ఇప్పుడు రోహిత్ శర్మ వన్డేలకు గుడ్ బై చెబుతారని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అయితే కోహ్లీ మాత్రం ఇంకొంతకాలం వన్డేల్లో కొనసాగుతాడని, అతడి ఫిజికల్ కండిషన్ బానే ఉందని, 2027 వరల్డ్ కప్ కూడా ఆడుతాడని చెబుతున్నాయి. ఏదేమైనా వన్డే క్రికెట్ నుంచి రోహిత్ తప్పుకుంటే మాత్రం,భారత క్రికెట్ లో ఓ శకం ముగిసినట్టేనని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications