Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం!

Rohit Sharma: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్‌లో పాల్గొంటున్నాడు. అయితే రోహిత్ పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లలో రోహిత్ శర్మ ఫామ్ అంత గొప్పగా ఏమీ లేదు. రోహిత్ శర్మ పేలవమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ ప్రత్యేక గౌరవం పొందబోతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ రోహిత్‌కు ప్రత్యేక బహుమతి ఇవ్వబోతోంది.

రోహిత్ శర్మకు ప్రత్యేక గౌరవం
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, ముంబై క్రికెట్ అసోసియేషన్ కౌన్సిల్ సమావేశంలో రోహిత్ శర్మ పేరు మీద ఒక స్టాండ్ ఏర్పాటు చేయడానికి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ముంబైలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరు మీద ఒక స్టాండ్ ను మనం చూడవచ్చు.

Rohit Sharma to Receive Rare Honor from Mumbai Cricket Association


ఐపీఎల్‌లో పాల్గొంటున్న రోహిత్ శర్మ.. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో ప్రత్యేకంగా ఏమి చేయలేదు. రోహిత్ సీఎస్కేపై పరుగులు ఏమీ చేయలేదు. సున్న పరుగులకే ఔటయ్యాడు. తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్ లో రోహిత్ 8 పరుగులు చేయగా.. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్ మ్యాన్ బ్యాట్ నుంచి 13 పరుగులు వచ్చాయి. ఆర్సీబీతో జరిగిన చివరి మ్యాచ్ లో కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఇప్పుడు రోహిత్ తన పేలవమైన ఫామ్ మధ్యే ప్రత్యేక గౌరవం పొందుతాడని భావిస్తున్నారు.

భారత జట్టు రెండో విజయవంతమైన కెప్టెన్
భారత జట్టు తరపు రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఎంఎస్ ధోని తర్వాత భారత జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ భారత తరఫున టీ20 ప్రపంచ కప్ 2024ను గెలుచుకున్నాడు. దీని తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను గెలుచుకుంది. కాగా.. ఎంఎస్ ధోని కెప్టెన్‌గా భారత్ తరపున 3 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్నాడు. ధోని కెప్టెన్సీలో 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. ఈ క్రమంలో భారత జట్టు రెండో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు.

Story first published: Tuesday, April 8, 2025, 16:13 [IST]
Other articles published on Apr 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+