Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: రోహిత్, తిలక్, సూర్యకుమార్ స్విమ్మింగ్ పూల్‌లోకి విసిరేసిన వ్యక్తి ఎవరు?(వీడియో)

IPL 2025: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో తొలి మ్యాచ్ లో ఓడిపోయింది. ఇప్పుడు ముంబై జట్టు తన రెండో మ్యాచ్ కోసం గుజరాత్‌లో ఉంది. ఈ మ్యాచ్ శనివారం నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్‌ల వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఓ వ్యక్తిని ఎత్తుకుని స్విమ్మింగ్ పూల్‌లోకి విసిరేస్తున్నారు.

ఈ వైరల్ వీడియో ముంబై ఇండియన్స్ జట్టు బస చేసిన హోటల్ కు సంబంధించినది. ఆ వీడియోలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో పాటు ఒక గార్డు కూడా ఉన్నాడు. అందరూ ఆ వ్యక్తిని ఎత్తుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గరకు ఎత్తుకొచ్చి అందులో పడేశారు. ఆ వైరల్ వీడియోలో అందరూ ఎత్తుకుని స్విమ్మింగ్ పూల్ లో విసిరిన వ్యక్తి ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అడ్మిన్ అని చెప్పుకుంటున్నారు.

Rohit Sharma Tilak Varma Suryakumar Yadav throwing someone into the swimming pool Video Goes Viral

తొలి విజయం కోసం ఎదురుచూస్తోన్న ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ తో మార్చి 29న(శనివారం) తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ముంబై ఇండియన్స్ లాగే గుజరాత్ టైటాన్స్ కూడా తమ తొలి మ్యాచ్ లో ఓడిపోయింది. ఈ రెండు జట్ల మధ్య ఇది రెండో మ్యాచ్.

Take a Poll

తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యా

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విఫలమైంది. హార్దిక్ పాండ్యా లేనప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నాడు. పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించబడింది. అది ఇప్పుడు ముగిసింది. తొలి మ్యాచ్ లో రోహిత్ శర్మ ఖాతా కూడా తెరవలేకపోయాడు. ర్యాన్ రికెల్టన్(13), విల్ జాక్స్(11) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. తిలక్ వర్మ 31 , సూర్య కుమార్ యాదవ్ 29 పరుగులు చేశారు.

Story first published: Thursday, March 27, 2025, 17:15 [IST]
Other articles published on Mar 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+