For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాలో సగభాగమైన రితికాను మిస్ అవుతున్నా: ఇనిస్టాగ్రామ్‌లో రోహిత్ శర్మ

Rohit Sharma in This Instagram Post Reveals He Is Missing His Wife Ritika Sajdeh in Australia

హైదరాబాద్: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దేష్‌ను విడిచి ఉండలేకపోతున్నాడంట. ఈ విషయాన్ని స్వయంగా రోహిత్ సోషల్ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ జట్టులో సభ్యుడిగా ఉన్న రోహిత్ శర్మ తాజాగా ఇనిస్టాగ్రామ్‌లో ఈ పోస్టు చేశాడు. "నాలో సగభాగమైన రితికాను మిస్ అవుతున్నా" అని భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు గంటల్లోపే రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

గతంలో టీమిండియా సిరీస్‌లు ఆడే ప్రతీ విదేశీ పర్యటనకు బోర్డు క్రికెటర్ల భార్యలతో పాటు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను అనుమతించేది. కానీ ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు సిరీస్ ఓటమి తర్వాత బీసిసిఐ ఆ సాంప్రదాయానికి తెరదించింది. దీంతో రోహిత్ భార్య రితికా సజ్దేష్ ముంబైలోనే ఉంది. రోహిత్ భార్య రితికా క్రికెట్ అభిమానులకు సుపరిచితమే.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హిట్టర్‌గా పేరుతెచ్చుకున్న రోహిత్ శర్మ టెస్ట్‌ల్లో మాత్రం తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో విఫలమవ్వడంతో రోహిత్‌ శర్మను వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నుంచి తప్పించారు. అయితే, విండిస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరిస్‌లో ఫామ్‌లోకి రావడంతో ఆస్టేలియాతో టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు.

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. గత నలభై ఏళ్లుగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నా... టీమిండియా ఇప్పటివరకు టెస్టు సిరిస్‌ను గెలవలేదు. ఈ నేపథ్యంలో ఆసీస్ గడ్డపై అందని ద్రాక్షగా మిగిలిపోయిన టెస్టు సిరీస్‌ని ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో కోహ్లీసేన ఉంది.

Story first published: Monday, December 3, 2018, 19:05 [IST]
Other articles published on Dec 3, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+