హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పుణ్యమా! అని వివిధ దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లు ద్వైపాక్షిక సిరిస్‌లు లేని సమయంలో భారత్‌కు వచ్చే వీలు ఏర్పడింది. దీంతో చాలా మంది విదేశీ ఆటగాళ్లు మన జాతీయ బాష అయిన హిందీని నేర్చుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.
తమ జట్టులోని సహచర భారత ఆటగాళ్లతో కొందరు అలవోకగా హిందీ మాట్లాడుతుండాగా.. మరి కొద్దరు ఆ పదాలను పలకడానికి కాస్త ఇబ్బందిపడుతున్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తరుపున ఆడుతున్న న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ మెక్‌గ్లాన్‌కు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ హిందీ పరీక్ష పెట్టాడు.

ఐపీఎల్ సమయంలో తాను నేర్పించిన హిందీ గుర్తుందా లేదా అని రోహిత్ శర్మ టెస్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని రోహిత్ శర్మ 'మెక్‌గ్లాన్ హిందీని పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నా' అని అభిమానులతో పంచుకున్నాడు. మరవైపు మిచెల్ మెక్‌గ్లాన్ ట్విట్టర్‌లో పోస్టు చేసి 'నా హిందీ ఎలా ఉంది? అని అభిమానులను ప్రశ్నించాడు.
ఇందుకు గాను నెటిజన్లు కొందరు నీబౌలింగ్‌లా ఉంది అనగా, మరికొందరు మా ఇంగ్లీష్‌లా ఉందని కామెంట్లు పెట్టారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. రోహిత్ హిందీలో నీకు తెలిసిన పదాలు చెప్పు అని మెక్‌గ్లాన్‌ను అడిగాడు. దీనికి మెక్‌గ్లాన్ ఎక్కువ తెలియదు కానీ కొన్ని తెలుసు అని నవ్వుతూ తండా పానీ, నయ్‌నయ్ అనగా వాటిని రోహిత్ నవ్వుతూ ఇంగ్లీష్‌లో చెప్పాడు.
గాయం కారణంగా 2015లో కోరీ ఆండర్సన్ ఐపీఎల్‌కు దూరం కావడంతో అతడి స్ధానంలో మిచెల్ చోటు దక్కించుకున్నాడు. గతేడాది ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలవడంలో మిచెల్ మెక్‌గ్లాన్ కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో 12 మ్యాచ్‌లాడిన మిచెల్ 18 వికెట్లు తీసుకున్నాడు.
ఇక, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యనటలో భాగంగా తొలి వన్డే అక్టోబర్ 22న వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఆటగాళ్లు కలుసుకున్నారు.