Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: రోహిత్ గ్రేట్ క్యాచ్.. సిరాజ్ స్టన్నింగ్ ఫీల్డింగ్ (Videos)

అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది. స్పిన్ వికెట్లపై అయినా సరే బాజ్‌బాల్ క్రికెట్ ఆడతామని ప్రకటించిన ఇంగ్లాండ్ చతికిలపడుతోంది. 137 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో టెస్టు మోడ్‌లోకి వచ్చి ఇంగ్లిష్ బ్యాటర్లు జాగ్రత్తగా ఆడుతున్నారు.

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. పరుగులు వేగంగా సాధిస్తూ పేసర్లపై ఒత్తిడి పెంచింది. దాంతో కెప్టెన్ రోహిత్ స్పిన్నర్లకు బంతిని అందించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ కథ మారిపోయింది. మన బౌలర్లు బంతుల్ని గింగరాలు తిప్పడంతో ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 55/0తో మెరుగైన స్థితిలో ఉన్న ఇంగ్లిష్ జట్టు కాసేపటికే 60/3కి చేరుకుంది. అయిదు పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది.

Rohit Sharma takes Great catch and Siraj Stunning fielding Videos goes viral

ఓపెనర్ బెన్ డకెట్ (35; 39 బంతుల్లో) అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వన్‌డౌన్ వచ్చిన ఒల్లీ పోప్ (1).. రోహిత్ శర్మ గ్రేట్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. జడేజా వేసిన బంతిని డిఫెండ్ చేయడానికి పోప్ ప్రయత్నించగా బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకుంది. స్లిప్‌లో ఉన్న రోహిత్ చురుకుగా ముందుకు కదిలి షార్ప్ క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే ఆ తర్వాత సిరాజ్ సూపర్బ్ ఫీల్డింగ్‌తో మరో ఓపెనర్ క్రాలే ఔటయ్యాడు.

అశ్విన్ బౌలింగ్‌లో క్రాలే షాట్ ఆడగా.. మిడ్ ఆఫ్‌లో ఉన్న సిరాజ్ ముందుకు డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన జో రూట్ (29; 60 బంతుల్లో), బెయిర్ స్టో (37; 58 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 108/3తో లంచ్ విరామానికి వెళ్లారు. కానీ రెండో సెషన్ ఆరంభంలోనే ఇంగ్లాండ్‌కు భారత్ స్పిన్నర్లు షాకిచ్చారు. కుదురుకున్న వారిద్దరిని పెవిలియన్‌కు చేర్చి గట్టిదెబ్బ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన ఫోక్స్‌ను అక్షర్ ఔట్ చేయడంతో 137 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో బెన్ స్టోక్స్, రెహాన్ అహ్మద్ ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్, జడేజా, అక్షర్ తలో రెండు వికెట్లు తీశారు.

Story first published: Thursday, January 25, 2024, 13:27 [IST]
Other articles published on Jan 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+