
రోహిత్ శర్మ సూపర్ హిట్
2021 సంవత్సరంలో టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్ము లేపాడు. మొత్తంగా ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది టెస్టుల్లో 21 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన హిట్‌మ్యాన్ 47 సగటుతో 906 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా ఓ ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఈ ఏడాది టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేయడం ద్వారా విదేశాల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు.
అలాగే అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా హిట్‌మ్యాన్ నిలిచాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా కూడా ప్రమోషన్ పొందాడు. వన్డే, టీ20ల్లో కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో జరిగిన 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తంగా ఈ ఏడాది రోహిత్ శర్మ సత్తా చాటి సూపర్ హిట్ అనిపించుకున్నాడు.

విరాట్ కోహ్లీ ఫ్లాప్
2021 సంవత్సరం కెప్టెన్ విరాట్ కోహ్లీకి అంతగా కలిసి రాలేదు. ఈ ఏడాది టెస్టుల్లో 19 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన కోహ్లీ కేవలం 28 సగటుతో 536 పరుగులు మాత్రమే చేశాడు. 4 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక సెంచరీ చేయక రెండేళ్లు అవుతుంది. అత్యధిక స్కోర్ 72 పరుగులు. ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీ బ్యాటర్‌గా విఫలమైనప్పటికీ కెప్టెన్‌గా పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ గడ్డపై టీమిండియాను అధిక్యంలో నిలిపాడు. కానీ అంతకుముందు జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఓటమి పాలైంది.
అయితే అదే సమయంలో కెప్టెన్‌గా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ముఖ్యంగా ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్‌కప్‌లో జట్టును కనీసం సెమీఫైనల్ కూడా చేర్చలేకపోయాడు. దీంతో కెప్టెన్‌గా తీవ్రమైన విమర్శలను ఎదుర్కొవాల్సి వచ్చింది. దీనికి తోడు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీని సెలెక్టర్లు వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. దీనిపై కోహ్లీ ఎంత ఆవేదన వ్యక్తం చేసిన ఫలితం లేకపోయింది. ఇక ఐపీఎల్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు.

రోహిత్ వర్సెస్ కోహ్లీ
2021లో టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చేసిన పరుగులను లెక్కలోకి తీసుకోని కొందరు అభిమానులు ఒకరితో ఒకరిని పోలుస్తున్నారు. ఈ ఏడాది రోహిత్ శర్మ సూపర్ హిట్ అని, విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అని సెటైర్‌లు వేస్తున్నారు. టీమిండియాలో కోహ్లీ పని అయిపోయిందని, ఇక నుంచి అంతా రోహిత్ టైమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో రోహిత్, కోహ్లీ అభిమానుల మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే నెలకొంటుంది.


Click it and Unblock the Notifications












